Nayan-Vignesh: ప్రస్తుతం ఎక్కడ చూసినా లేడీ సూపర్ స్టార్ నయనతార సరోగసీ గురించే చర్చ నడుస్తోంది. పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పి షాకిచ్చారు. సరోగసీ ద్వారా వీరు తల్లిదండ్రులు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక వీరు పిల్లలను ఎలా కన్నారో అని తమిళనాడు ప్రభుత్వం కూడా వివరణ అడగడంతో నయన్ సరోగసీ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలా హాట్ టాపిక్ గా మారడానికి కారణం ఇండియాలో సరోగసీ బ్యాన్ చేయడమే.. 2019 లో ఈ పద్దతి ద్వారా పిల్లలను కనడం చట్టరీత్యా నేరమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయినా చట్టాన్ని ఉల్లంఘించి నయన్.. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే ఆమెను చిక్కులో పడేసింది. బయట ఇంత వివాదం జరుగుతున్నా ఈ జంట నోరువిప్పింది లేదు.
అసలు ఈ పిల్లలు ఎక్కడినుంచి వచ్చారు. సరోగసీ చేయించారా..? చేస్తే ఎక్కడ చేయించారు..? పోనీ ఎవరి పిల్లలైనా దత్తత తీసుకున్నారా..? అది లీగల్ గా జరిగిందా..? ఇవన్నీ నెటిజన్లను తొలుస్తున్న ప్రశ్నలు.. లీగల్ గా ప్రొసీడ్ అయ్యి దత్తత తీసుకొంటే ఓకే.. లేకపోతే అదొక చిక్కు. లేదు దత్తత కాదు సరోగసీనే అయ్యి ఉంటే నయన్ దంపతులు తప్పు చేసినట్లే.. ఇండియా లో బ్యాన్ చేసిన పద్దతి ద్వారా పిల్లలను కని వారు కోర్టు తీర్పును ఉల్లంఘించారు. అలా ఉల్లంఘించినందుకు ఈ జంట పెద్ద శిక్షనే అనుభవించనున్నారు అనేది కోలీవుడ్ వాదన. ఈ యాక్ట్ ద్వారా ఆ శిక్ష ఏమై ఉంటుంది అనేది అందరు సెర్చ్ చేస్తున్నారు. సరోగసీ యాక్ట్ 2021 ప్రకారం అనైతికంగా అద్దె గర్భంద్వారా పిల్లలను కన్నవారికి ఐదేళ్లు జైలు శిక్ష.. రూ. 50 వేలు జరిమానా. ఒకవేళ ఇదే పనిని రెండో సారి కూడా చేస్తే వారికి పదేళ్లు జైలు శిక్ష రూ. లక్ష జరిమానా విధించాలని ఉంది. దీని ప్రకారం నయన్- విగ్నేష్ కనుక తమ సరోగసీ లీగల్ అని నిరూపించని యెడల వారు కూడా ఈ శిక్షకు అర్హులే. మరి ఇప్పుడైనా ఈ జంట తమ పిల్లల విషయంలో నోరు విప్పుతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.