టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.. స్టార్ హీరో పుట్టినరోజు కానుకగా పాత సినిమాలను రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు. ఆ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఇప్పటి వరకు చాలానే రీ రిలీజ్ అయ్యాయి… ఇంకా రిలీజ్ అవుతున్నాయి కూడా. ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సినిమాల సందడే ఎక్కువుగా కనిపిస్తుంది. హిట్ సినిమా, ప్లాప్ సినిమా అని తేడా లేకుండా రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలు మాత్రమే కాదు తమిళ స్టార్ హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతూ అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తున్నాయి. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమా రీరిలీజ్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ ప్రకటించారు.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించిన నాయక్ సినిమా 2013 లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ తెరకెక్కించారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే కామెడీ సీన్స్ ఇప్పటికీ ఎంతో పాపులర్ అని చెప్పొచ్చు. అయితే నాయక్ సినిమానను ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎంతో గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేసారు. అయితే ఈ రీ రిలీజ్ ఆగిపోయింది. ప్రముఖ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మరియు మెగా అభిమాని అయిన శివ చెర్రీ ఈ మూవీ రీ రిలీజ్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాంచరణ్ నాయక్ సినిమా రీ రిలీజ్ పై మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సాధారణంగా స్టార్ హీరో ల సినిమాల రీ రిలీజ్ లను అభిమానుల యొక్క డిమాండ్ తో మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. కానీ నాయక్ సినిమా రీ రిలీజ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం మేము మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకుల గురించి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం అంటూ ఆయన స్పందించారు.
https://twitter.com/sivacherry9/status/1691433100000239616?s=20