Naveen Polishetty: జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా నవీన్ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అనగనగా ఓ రాజు, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరొకటి చేస్తున్నాడు. స్వీటీ అనుష్కతో నవీన్ జతకట్టనున్న విషయం తెల్సిందే. మహేష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి స్వీటీ లుక్ ను రిలీజ్ చేశారు. అన్వితా రవళి శెట్టి అనే పాత్రలో స్వీటీ కనిపించనుంది.
ఇక నేడు నవీన్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ అతని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి కాస్తా సిద్దు పోలిశెట్టిగా మారిపోయాడు. సిద్దు అనే పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్ ను బట్టి నవీన్ స్టాండప్ కమెడియన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మిస్టర్ పోలిశెట్టి.. మిస్ శెట్టిని ఎలా పడేస్తాడు అనేది కథగా తెలుస్తోంది. ఇందులో నవీన్తనకన్నా పెద్దది అయిన అనుష్క ప్రేమలో పడతాడని, ఆమె ప్రేమకోసం మిస్టర్ పోలిశెట్టి ఏం చేశాడు అనేది వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి హిట్ అందుకుంటారో లేదో చూడాలి.