Naveen Polishetty: ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. ఇక రెండో సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమాలో నటించి అంతకు మించిన బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నవీన్.. సైమా అవార్డ్స్ కు ఎంపిక అయ్యాడు. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సైమా అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 విభాగాల్లో జాతిరత్నాలు నామినేట్ అయ్యింది.
ఇక నవీన్ పోలిశెట్టి ఉత్తమ నటుడుగా నామినేట్ అయ్యాడు. ఈ చిత్రంలో నవీన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నవీన్ కామెడీ టైమింగ్ కు ప్రతి ప్రేక్షకుడు ఫిదా అయ్యాడంటే అతిశయోక్తి కాదు. ఉత్తమ నటుడిగా నవీన్ అవార్డును సొంతం చేసుకుంటే కనుక కష్టపడి పైకి వచ్చిన వారి ట్యాలెంట్ కు ప్రతిఫలం దక్కినట్లే అని అభిమానులు అంటున్నారు. మరి ఈసారి సైమా అవార్డుల్లో ఈ జాతి రత్నాలు ఎన్ని అవార్డులను అందుకొంటారో చూడాలి.