Navdeep to announce something New Soon: టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించాడు నవదీప్. ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు ఆయన. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉండే నవదీప్ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కాక తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ…ప్రతి రోజూ ఇంటికి వెళ్లిన, ఇన్ స్టాగ్రామ్ కు వెళ్లిన ఒకటే క్వశ్చన్… అది ఎప్పుడు అని. చెప్తా.. రేపు చెప్తా.. అది నా పెళ్లి డేట్ అయి ఉండవచ్చు.. లవ్ మౌళి రిలీజ్ డేట్ అయి ఉండవచ్చు.
Gouri Kishan: సైలెంటుగా పెళ్లి చేసుకున్న 96 నటి.. కానీ అసలు ట్విస్ట్ అదే?
ఎలక్షన్స్ లో నేను నిలబడుతున్న నామినేషన్ డేట్ అయుండొచ్చు. చెప్తా.. రేపు చెప్తా.. అప్పటి దాకా మీరు గెస్ చేయండి.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్టుకు డేట్, డేటేడ్, డేటింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది పక్కాగా సినిమా డేట్ అయింటుందిలే అంతకు మించి ఏమి ఉండదు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంత మంది ఏదైనా చెప్పు బ్రో… మేం బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.