Gouri Kishan Marriage News: ఈ మధ్యకాలంలో అనూహ్యంగా హీరోలు- హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లతో పాటు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చాలా సైలెంటుగా చేసేసుకుంటున్నారు. ఏకంగా సిద్దార్థ్-అదితి రావు హైదరీ అయితే షూటింగ్ అని పర్మిషన్ తీసుకుని ఎంగేజ్మెంట్ చేసుకుని తరువాత అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు అలాగే మరో జంట కూడా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 2018లో తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష చిన్ననాటి పాత్రల్లో గౌరీ కిషన్, ఆదిత్య నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ చేసిన రామ్, జాను పాత్రలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. అయితే తాజాగా ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు గౌరీ కిషన్ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Mad Max: మాడ్ ఎక్కించడానికి మళ్ళీ వచ్చేస్తున్నారు!
అయితే అది నిజమైన పెళ్లి అనుకుని అందరూ కంగ్రాట్స్ చెబుతుండగా ఒక షాక్ ఇచ్చారు. అదేమంటే ఇది నిజమైన పెళ్లి కాదని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా చేశారని వెల్లడించారు. గౌరీ కిషన్, ఆదిత్య తాజాగా నటించిన ‘హాట్ స్పాట్’ సినిమాకి విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫొటోలను మేకర్స్ విడుదల చేయగా ఫొటోలను చూసి నెటిజన్లు నిజంగానే ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు భావించారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై మేకర్స్ స్పందిస్తూ ఇది ప్రమోషన్స్‌లో భాగంగా చేసినట్లు వెల్లడించడం హాట్ టాపిక్ అయింది.