తాజాగా నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ...ప్రతి రోజూ ఇంటికి వెళ్లిన, ఇన్ స్టాగ్రామ్ కు వెళ్లిన ఒకటే క్వశ్చన్... అది ఎప్పుడు అని. చెప్తా.. రేపు చెప్తా.. అది నా పెళ్లి డేట్ అయి ఉండవచ్చు.. లవ్ మౌళి రిలీజ్ డేట్ అయి ఉండవచ్చు.
Navdeep: టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ఇక తాజాగా మరో హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జై అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు నవదీప్. పిల్లి కళ్ళతో డిఫరెంట్ గా కనిపించి.. తనదైన నటన కనబరుస్తూ మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు.