Navdeep ED Interrogation: మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ని ప్రశ్నించడం కోసం విచారణకు పిలిచింది. ఇక ఎట్టకేలకు హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయానికి చేరుకోగా రాత్రి 7 గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దాదాపు 8 గంటల పాటు నవదీప్ ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు అయింది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ పెడ్లర్లతో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానం ఉండడంతో నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించినట్టు తెలుస్తోంది.
Prema Vimanam: సినిమా చేశాకే విమానం ఎక్కాలని ఫిక్స్ అయ్యా : డైరెక్టర్ సంతోష్
గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో ఇటీవల నమోదైన డ్రగ్స్ కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా ఈనెల 10న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో టీన్యాబ్ కేసు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ ఆయనని విచారించింది. ఏ కేసులో నార్కోటిక్స్ పోలీసులు ఇప్పటికే బెంగళూరులో పలువురు నైజీరియన్లను అదుపులోకి తీసుకోగా నవదీప్ మొబైల్‌ను కూడా పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లు, బ్యాంకు లావాదేవీలతో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై ఇవాళ ఈడీ అధికారులు ఆరా తీసినట్టు చెబుతున్నారు. నవదీప్ ను ప్రశ్నించే క్రమంలో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ ఆ విషయం మీద అధికారికంగా ప్రకటించలేదు.