Prema Vimanam: సినిమా చేశాకే విమానం ఎక్కాలని ఫిక్స్ అయ్యా : డైరెక్టర్ సంతోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prema Vimanam Movie Premier Press meet: అభిషేక్ పిక్చర్స్, జీ 5 తో సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఫిల్మ్‌ను అక్టోబర్ 13న జీ 5లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవగా ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఈ చిత్రం, ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించడం గమనార్హం. సంతోష్ కాటా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, రవివర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రీమియర్ షోని మంగళవారం మీడియాకు ప్రదర్శించగా ఆ తరువాత యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో డైరెక్టర్ సంతోష్ కాటా మాట్లాడుతూ ‘నేను విమానం ఇంత వరకు ఎక్కలేదు, సినిమా చేశాకే విమానం ఎక్కాలని ఫిక్స్ అయ్య,. సినిమా హిట్ అయితేనే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని అనుకున్నానని అన్నారు. ఈ చిన్న పిల్లలు ఆ పాత్రలను అద్భుతంగా పోషించారని, నిర్మాత పిల్లలనే ఉద్దేశంతో సినిమాలోకి తీసుకోలేదు, ఆ పిల్లలు చాలా కష్టపడ్డారు, పిల్లల నటన చూసి అభిషేక్ నామా చాలా సంతోషించారని అన్నారు. అనసూయ మాట్లాడుతూ కొన్ని సార్లు దర్శకులు చెప్పిన కథకు, తీసిన దాంట్లో తేడా ఉంటుంది కానీ సంతోష్ మాత్రం ఏం చెప్పాడో.. ఎలా చెప్పాడో అదే తీశాడు. మొదటి సినిమా దర్శకుడిలా కనిపించలేదు, సెట్‌లు ఎక్కువగా వేయలేదు, అంతా నేచురల్‌గా షూట్ చేశారని అన్నారు. చిన్న పిల్లలు షూటింగ్‌ను ఎంతో కష్టపడి చేశారు, నేను ప్రతీ సారి కొత్తగా ఉండే కథలను ఎంచుకుంటూ వస్తా, నా బలం గ్లామర్ అని కొంత మంది అంటారు కానీ అది నిజం కాదని అన్నారు. ఈ ప్రయాణం వల్ల ఈ చిత్రంతో ప్రేమలో పడిపోయాను. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. మా ప్రేమ విమానంను అక్టోబర్ 12న జీ5లో అందరూ వీక్షించండి’ అని అన్నారు.
Laksh 08: ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ డైరెక్టర్ కొత్త సినిమా మొదలెట్టాడు!
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
జీ 5 కంటెంట్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘వెబ్ ఫిల్మ్స్ వద్దు అనుకున్న టైంలోనే సంతోష్ వచ్చి ఈ కథ చెప్పాడు. గట్టిగా అనుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది సంతోష్ నమ్మాడు. అందుకే ఈ ప్రేమ విమానం ఓకే అయింది. ఆయన రైటింగ్ ఎంతో బాగుంది. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించింది. మ్యాడ్ మూవీతో సంగీత్ శోభన్ ఆల్రెడీ థియేటర్లో హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఓటీటీలో హిట్టు ఇవ్వబోతోన్నాడు. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ చిత్రం’ అని అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ గాంధీ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ సంతోష్ ఈ సినిమాను ఎంతో బాగా తీశాడు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. దర్శకుడు కథ ఎలా చెప్పాడో.. తెరపై అలానే చూపించారు’ అని అన్నారు. కెమెరామెన్ జగదీష్ చీకటి మాట్లాడుతూ.. ‘మా నిర్మాత అభిషేక్ ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. ఫిల్మ్ మేకింగ్‌లో ఎన్నో విషయాలు చెప్పారు. నటీనటులంతా అద్భుతంగా పర్పామ్ చేశారు. అమర్ ఎడిటింగ్ బాగుంది. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!