Hyderabad Police to Serve Notices Baby Movie Team: తాజాగా హైదరాబాద్ పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ లో నైజీరియన్లు, సినీ నిర్మాత, మాజీ ఎంపీ కుమారుడు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇక ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఇటీవలే విడుదల అయిన బేబీ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బేబీ సినిమాలో డ్రగ్స్ ఏ విధంగా ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారని, ఇలాంటి వాటిని సినిమాల్లో చూపించవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు. బేబీ సినిమా టీమ్ కు నోటీసులు ఇస్తాం అన్న ఆయన ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని అన్నారు. ఇక ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో మేము రైడ్ చేసినప్పుడు ఉన్న సన్నివేశాలు బేబీ సినిమాలో ఉన్నాయని, సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారని ఆయన అన్నారు.
Big Breaking: కోలీవుడ్ లో సంచలనం.. ధనుష్ తో సహా ఆ హీరోలపై బ్యాన్ విధించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్
సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టి కనీసం కాషన్ కూడా వెయ్యకుండా డైరెక్ట్ గా చూపించారని ఆయన అన్నారు. మేము హెచ్చరిస్తే ఆ కాషాన్ లైన్ యూనిట్ వేసిందని అన్నారు. ఇపుడు బేబీ సినిమా ప్రొడ్యూసర్ కి నోటీసు ఇస్తామని పేర్కొన్న ఆయన ఇక పై అన్ని సినిమాల పై ఫోకస్ పెడతామని అన్నారు. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని పేర్కొన్న ఆయన బేబీ సినిమా అభ్యంతరకర సన్నివేశాలు ప్లే చేసి మరీ వివరించారు. ఇక ఇప్పటి నుంచి ప్రతి సినిమా పై పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య పాష్ కల్చర్ కి అలవాటు చేసేందుకు సీత పాత్రధారి ఆమెకు గంజాయి తాగడం, హుక్కా కొట్టడం, వంటి చేసి చూపించింది. అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నట్టు కూడా చూపించారు. ఇప్పుడు అదే దృశ్యాలను కమిషనర్ తప్పు పట్టారు.