Nani: ఛీఛీ.. ఏం సినిమా అది.. తీశావులే బోడి ‘బాహుబలి’ అని రాజమౌళిని అనేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani: న్యాచురల్ స్టార్ నానికి- దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న స్నేహబంధం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఈగ అనే సినిమా వచ్చింది. అప్పటినుంచి వీరి రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నారు. ఇక నానికి హెల్ప్ కావాలన్నప్పుడు రాజమౌళి సాయం చేస్తూ ఉంటాడు. రాజమౌళి, కీరవాణి వారసులకు నాని తనదైన సాయం చేస్తూ ఉంటాడు. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా నటించిన ఉస్తాద్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రాజమౌళితో పాటు నాని కూడా ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఇక ఈ ఈవెంట్ లో నాని జక్కన్న కుటుంబం గురించి మాట్లాడాడు. ఎవరు ఎన్ని రివ్యూలు ఇచ్చినా కూడా కీరవాణి భార్య వల్లి ఇచ్చే రివ్యూలు కోసం ఎదురుచూస్తాను అని తెలిపాడు. రాజమౌళి అయితే బావుంటే బావుందని చెప్తాడు.. బాగోకపోతే అస్సలు ఫోన్ కూడా చేయడు. అదే రమా రాజమౌళి అయితే.. ఎలా ఉన్నా ఓకే అంటారు. కానీ, కీరవాణి భార్య వల్లి అయితే ఛీఛీ.. ఏం సినిమా అది.. అని ముఖం మీద చెప్పేస్తారు. నా విషయంలోనే కాదు బాహుబలి సినిమా రిలీజ్ అప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు రాజమౌళి.. ఇంకోసారి సినిమాకు వెళ్దామా నాని అనగానే.. వల్లి గారు వెంటనే..తీశావులే బోడి సినిమా.. మళ్లీ వెళ్తారా.. ? అని అనేశారు. అలాంటి నిజాయితీ మనుషులు ఉన్న కుటుంబం అది అని చెప్పుకొచ్చాడు.
Anirudh Ravichandran: ఏం తాగి కొడుతున్నావయ్యా.. మ్యూజిక్.. మెంటల్ ఎక్కిపోతుంది థియేటర్ అంతా
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
“రాజమౌళి అండ్ టీమ్ కొత్త పాత అని సంబంధం లేకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. నా సినిమాల విషయంలో వారెలా స్పందిస్తారోనని ఆలోచిస్తుంటాను. వాళ్లు చెప్పే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంటాను. సింహా విషయానికి వస్తే తను గ్రౌండ్ లెవల్లోనే ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీనే అలా ఉంటుంది.
రాజమౌళి ఫ్యామిలీలో అందరూ టెక్నీషియన్సే యాక్టర్స్ లేరని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సింహా రూపంలో యాక్టర్ కూడా వచ్చేస్తున్నాడు. తను కూడా టాప్ పోజిషన్‌లో నిలుస్తాడు. కావ్యా కళ్యాణ్ రామ్ మంచి కంటెంట్‌ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తుంది. మన అని అనుకునే హీరోయిన్స్‌లో తను కూడా నిలుస్తుంది. ఉస్తాద్ అనే పేరులోనే పవర్ ఉంది. ట్రైలర్‌లో ఎనర్జీ ఉంది. ఉస్తాద్ పాజిటివ్ వైబ్స్‌తో ఆగస్ట్ 12న రిలీజ్ అవుతుంది. శ్రీసింహా కెరీర్‌లో ఉస్తాద్ మెమొరబుల్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను” అంటూ తెలిపాడు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?