Natti Kumar Says he will Stop RGV Movie Releases: దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు, నాకు మధ్య డబ్బు బాకీ యుద్ధం జరుగుతుంటే, మధ్యలో వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్లు ఎందుకు జోక్యం చేస్తుకుంటున్నారని నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. “వర్మ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అందుకు ఆయన నాకు బ్యాంకు చెక్కులు కూడా ఇచ్చారు. అయితే అవి బౌన్స్ అయ్యాయి కూడా. వాటి గురించి చాలాకాలంగా వర్మను ప్రశ్నిస్తుంటే ఇదిగో, అదిగో అంటూ సరిగా జవాబు చెప్పడం లేదు..ఆయన ఇచ్చిన హామీ ప్రకారం తాను తీసిన లేదా డైరెక్షన్ చేసిన ఏ సినిమాను అయినా విడుదలను అడ్డుకునే హక్కు నాకుంది.
Jigarthanda DoubleX: మంచోడు గురించి సినిమా తీస్తే ఎవరూ చూడరమ్మా!
ఈ నేపథ్యంలో ఆయన నాకు బాకీ ఉన్న డబ్బులు పూర్తిగా వచ్చేంతవరకు “వ్యూహం” సినిమానే కాదు ఆయన నుంచి రాబోయే ఏ సినిమా అయినా విడుదలను అడ్డుకుంటాను. వాస్తవానికి వర్మకు, నాకు మధ్య నడుస్తున్న బాకీ యుద్దానికి, వై.ఎస్.ఆర్. పార్టీకి సంబంధం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. భయపడే తత్త్వం నాది కాదు. ఏ కేసులు నాపై పెట్టినా వాటిని ఎదుర్కోగలను, చంద్రబాబునాయుడు అంత పెద్ద మనిషిని అరెస్ట్ చేసి, 55 రోజులు జైల్లో పెట్టించిన వారికి నేను ఒక లెక్కనా! అన్నారు. నారా చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని అక్రమంగా అరెస్టు చేయడం నాకెంతో భాధను కలిగించడంతో దానిని ఖండించానని అన్నారు. “వ్యూహం ” సినిమా అడ్డుకుంటున్నానని నా గురించి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. అయినా నేను లీగల్ గానే పోరాటం చేస్తాను, నా డబ్బులు పూర్తిగా వచ్చేంతవరకు వర్మ సినిమాలను రిలీజ్ లను అనుకుంటూనే ఉంటానని అన్నారు