Subhash Chandrabose: ‘కార్తికేయ 2’ తో నేషన్ వైడ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాడు హీరో నిఖిల్. ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో సెన్సేషనల్ మూవీతో పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఇది భారత్ హిడెన్ స్టొరీ కావడం విశేషం. 2023 ఇండియన్ బెస్ట్ సీక్రెట్ కోసం పోరాటం నిఖిల్ చేస్తున్న పోరాటం ఇది. ఈ ‘స్పై’ మూవీ నేపథ్యాన్ని తెలియచేస్తూ, మేకర్స్ ఒక చిన్న వీడియోను విడుదల చేశారు. ‘తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా’ (మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అనే నినాదం ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఈ సినిమా ఆయన గురించే ఉండబోతోంది. ఆ దేశభక్తుడి మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలా దాగి ఉన్న కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం. ‘స్పై’ ఈ జానర్ లో డిఫరెంట్ మూవీ.
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.రాజ శేఖర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29న ‘స్పై’ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఈ మూవీ టీజర్ ను మే 12న రిలీజ్ చేయబోతున్నారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ సెకండ్ లీడ్ గా ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోంది. ఆర్యన్ రాజేష్ తన కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి కథను అందించడం విశేషం. ఈ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
It will be BIG! EXPLOSIVE & EPIC! 🔥 💥 Get ready for an action adventure on a world of secrets.
Join us on a mission to unravel India's best kept secret the Great Subhash Chandra Bose 🙏🏽
A Stunning subject which I Truly believe in #SPY
Logo & Release date Announcement 👉🏻… pic.twitter.com/Wbdl0DntYv— Nikhil Siddhartha (@actor_Nikhil) May 6, 2023