National Film Awards winners : ఒకటి ఉత్తరానికి, మరోటి దక్షిణానికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డును ఇద్దరికేసి ప్రదానం చేస్తున్నారు. అంతకు ముందు కూడా ఈ అవార్డును కొన్ని సార్లు ఇద్దరికి ఇచ్చారు. కానీ, 2018, 2019, 2020 సంవత్సరాలకు గాను వరుసగా ఉత్తమ నటుడు కేటగిరీలో ఇద్దరికేసి అవార్డులు ఇస్తూ ఉండడం గమనార్హం! 2018 సంవత్సరానికి గాను ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ‘అంధాదున్’ సినిమా ద్వారా ఆయుష్మాన్ ఖురానా, ‘యురి: ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రం ద్వారా విక్కీ కౌశల్ అవార్డును షేర్ చేసుకున్నారు.
కాగా, 2019లో ప్రదానం చేసిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఇదే ఉత్తమ నటుడు విభాగంలో హిందీ చిత్రం ‘భోంస్లే’ ద్వారా మనోజ్ బాజ్ పాయ్, తమిళ సినిమా ‘అసురన్’తో ధనుష్ పురస్కారాన్ని పంచుకోవలసి వచ్చింది. 67వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటుడు అవార్డును ఉత్తరాదిలో ఒకరికి, దక్షిణాదిన మరొకరికి పంచడం జరిగింది. అదే పంథాలో 2020కి గాను ప్రకటించిన 68వ నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ లోనూ బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఉత్తరాదికి చెందిన అజయ్ దేవగణ్ తన ‘తానాజీ’ చిత్రం ద్వారా, దక్షిణాదికి చెందిన సూర్య ‘సురారై పొట్రు’ తోనూ ఎంపికయ్యారు. ఉత్తర, దక్షిణ భేదం చూపడం లేదంటూ కేంద్రం ఈ పంథాను భవిష్యత్ లోనూ అనుసరిస్తుందేమో చూడాలి!
Also Read
- RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
- Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..