71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఢిల్లీలో కేంద్రం శుక్రవారం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘12th ఫెయిల్’ను అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఎంపికయ్యారు. ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీకి ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) దక్కించుకున్నారు. నేషనల్ అవార్డ్స్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే.
నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరి:
స్పెషల్ మెన్షన్ చిత్రాలు: క్రానికల్ ఆఫ్ ది ప్యాడీ మ్యాన్ (మలయాళం), ది సీ అండ్ సెవెన్ విలెజెస్ (ఒడియా)
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్: ఉత్పల్ దత్తా (అస్సామి)
ది సీ అండ్ సెవెన్ విలేజెస్ (ఒడియా): హమన్షు శేఖ్రా ఖౌతా డైరెక్టర్
బెస్ట్ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ) చిదానంద నాయక్
బెస్ట్ వాయిస్ ఓవర్: ది సీక్రేడ్ జాక్ (ఇంగ్లీష్).. ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీ ఆఫ్ విషెస్ (హరికృష్ణన్ ఎస్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ) ప్రాణిల్ దేశాయ్
ఎడిటర్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్) నీలాద్రి రాయ్
బెస్ట్ సౌండ్ డిజైన్: ధున్దగిరి కే ఫూల్ (హిందీ) శుభరన్ సేన్ గుప్తా
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్) శరవణముత్తు సౌందరపాండి, మీనాక్షి సోమన్
బెస్ట్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ) డైరెక్టర్ పియూష్ ఠాకూర్
బెస్ట్ షార్ట్ ఫిల్మ్: గిద్ధ్ ది స్కావేంజర్ (హిందీ) మనిష్ సైని డైరెక్టర్
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఎన్విరాన్మెంటల్: ది సైలెంట్ ఎకాడిమిక్ (హిందీ) డైరెక్టర్ అక్షత్ గుప్తా
బెస్ట్ డాక్యుమెంటరీ: గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ) రిషిరాజ్ అగర్వాల్
బెస్ట్ ఆర్ట్స్ కల్చర్ ఫిల్మ్: టైమ్ లెస్ తమిళనాడు (ఇంగ్లీష్) కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్టర్, నిర్మాత సెలెబ్రిటీస్ మేనేజ్‌మెంట్ ప్రై లిమిటెడ్, సంజిబ్ పరసార్
బెస్ట్ బయోగ్రఫికల్/హిస్టారికల్: మా బౌ మా గాన్ (ఒడియా) లెంటినా ఓ (ఇంగ్లీష్)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: మౌ: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చ్రౌ (మిజో) శిల్పిక బోర్డోలోయ్
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ) సౌమ్యాజిత్ ఘోష్ దాస్టిదార్
ఫీచర్ ఫిల్మ్స్:
స్పెషల్ మెన్షన్ రీ రికార్డింగ్ మిక్షర్: యానిమల్ (హిందీ) ఎమ్ఆర్ రాధాకృష్ణన్
బెస్ట్ టాయ్ ఫాకే ఫిల్మ్: పై తాంగ్ స్టెప్ ఆఫ్ హోప్
బెస్ట్ గారో ఫిల్మ్: రింగిగిట్టాంగ (రాప్చర్), డైరెక్టర్ డోమెనిక్ మేగమ్
బెస్ట్ తెలుగు ఫిల్మ్: భగవంత్ కేసరి (తెలుగు) అనిల్ రావిపూడి
బెస్ట్ తమిళ్ ఫిల్మ్: పార్కింగ్, రామ్ కుమార్ బాలకృష్ణణ్ డైరెక్టర్
బెస్ట్ పంజాబి ఫిల్మ్: గోడే గోడే ఛా విజయ్ కుమార్ అరోరా
బెస్ట్ ఒడియా ఫిల్మ్: పుష్కరా డైరెక్టర్ శుభ్రన్షు దాస్
బెస్ట్ మరాఠీ సినిమా: శ్యామ్చి ఆయ్ డైరెక్టర్ సుజాయ్ సునీల్ ధాకే
బెస్ట్ మలయాళం: ఉల్లుజు, డైరెక్టర్ క్రిస్టో టామీ
బెస్ట్ కన్నడ సినిమా: ది రే ఆఫ్ హోప్, డైరెక్టర్ యశోద ప్రకాశ్
బెస్ట్ హిందీ సినిమా: కఠల్: ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ, డైరెక్టర్ యశ్వోర్ధన్ మిశ్రా
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: వష్ హైఫ్నోసిస్
బెస్ట్ బెంగాలి: దీప్ ఫ్రిడ్జ్, డైరెక్టర్ అర్జున్ దత్తా
బెస్ట్ అస్సామి: రొంగటపు 1982, డైరెక్టర్ ఆదిత్యమ్ సైకియా
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: హనుమాన్ నందు పృథ్వీ
బెస్ట్ కొరియోగ్రఫీ: ధింధోర బజే రే, వైభవి మర్చంట్
బెస్ట్ లిరిక్స్: బలగం ఊరు పల్లెటూరు, కాసర్ల శ్యామ్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్ఠర్: వాతి జివి ప్రకాశ్ కుమార్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్
బెస్ట్ మేకప్: స్యామ్ బహద్దూర్,
బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైనర్: సామ్ బహద్దూర్, సచిన్ లోవకేర్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: 2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో, మోహన్ దాస్ డైరెక్టర్
బెస్ట్ ఎడిటర్: పూక్కాలమ్, మిధున్ మురళి మలయాళం
బెస్ట్ సౌండ్ డిజైనింగ్: యానిమల్ హిందీ, సచిన్ సుధాకరన్ అండ్ హరిహరన్ మురళీధరన్
బెస్ట్ స్క్రీన్ ప్లే: బేబీ, సాయి రాజేష్
బెస్ట్ డైలాగ్ రైటర్: సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై, రైటర్ దీపక్ కింగ్రానీ
బెస్ట్ సినిమాటోగ్రఫీ: కేరళ స్టోరీ (హిందీ) ప్రశాంతను మోహపాత్ర
బెస్ట్ ఫీమేల్ సింగర్: చెలియా జవాన్, శిల్పా రావు
బెస్ట్ మేల్ సింగర్: బేబీ ప్రేమిస్తున్నా, రోహిత్ విపిఎస్ఎన్
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి, గాంధీ తాత చెట్టు
బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఫీమేల్: ఉలూలు, మలయాళం ఊర్వశి వష్ (గుజరాతి) జాన్కీ బోడివాలా
బెస్ట్ సపోర్టింగ్ రోల్ మేల్: పూక్కాలం విజయరాఘవన్, పార్కింగ్, ముథుపెట్టై సోము భాస్కర్
బెస్ట్ నటి: రాణి ముఖర్జీ, మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే
బెస్ట్ యాక్టర్: షారుక్ ఖాన్ జవాన్, విక్రాంత్ మెస్సీ 12త్ ఫెయిల్
బెస్ట్ డైరెక్టర్: కేరళ స్టోరీ, సుదీప్తో సేన్
బెస్ట్ ఫిల్మ్: యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్: హనుమాన్
బెస్ట్ చిల్డ్రన్ సినిమా: నాల్ 2 మరాఠీ సుధాకర్ రెడ్డి ఎక్కంటి
బెస్ట్ ఫీచర్ పిల్మ్ ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్: స్యామ్ బహద్దూర్, మేఘన గుల్జార్ డైరెక్టర్ హిందీ
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ హోల్ సమ్ ఎంటర్‌టైన్మెంట్స్: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, కరణ్ జోహార్
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్: అత్మపామ్ప్లేట్ మరాఠి ఆశిష్ బండే
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 12త్ ఫెయిల్ హిందీ, విధు వినోద్ చోప్రా