NTR: నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు నందమూరి హీరో అత్తగారింటి వైపు నుంచి కూడా ఒక హీరో దిగుతున్నాడు. అతనే ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్. ఎన్టీఆర్ భార్య ప్రణతి స్వయానా తమ్ముడు నితిన్. ఇతగాడిని లాంచ్ చేయడానికి ఎన్టీఆర్ బాగానే కష్టపడుతున్నాడట. ఇప్పటికే నితిన్ మొదటి సినిమా టైటిల్ శ్రీశ్రీశ్రీ రాజావారు అని, ఆ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతేడాది ఎప్పుడో ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటివరకు ఈ సినిమా ఉందా లేదా అనేది తెలియదు. అయితే ఇన్నిరోజులు తరువాత ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఎన్టీఆర్ బామ్మర్ది కోసం.. పవన్ ప్రొడ్యూసర్ రంగంలోకి దిగాడట. అదేనండీ.. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ కుర్ర ప్రొడ్యూసర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త హీరోలను ఇంట్రడ్యూస్ చేయాలన్నా.. స్టార్ హీరోలకు మంచి గుర్తిండిపోయే హిట్లు ఇవ్వాలన్నా అందులో నాగవంశీకి మంచి ప్రావీణ్యం ఉంది.
Pragya Jaiswal: ఎంత విప్పి చూపించినా అమ్మడిని పట్టించుకోరేంటయ్యా
ఇక తాజాగా నితిన్ బాధ్యతలను నాగవంశీ అందుకున్నాడని సమాచారం. కొన్ని కారణాల వలన ఆగిపోయిన ఈ సినిమాను నాగవంశీ భుజాన వేసుకొని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడట. ఇక నుంచి ఈ సినిమా పూర్తి బాధ్యతలు మనోడే మోస్తున్నాడని టాక్ నడుస్తోంది. కాలేజ్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుందట. నాగవంశీ మొదటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆ అభిమానంతో పాటు కథ కూడా నచ్చడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే నితిన్ పంట పండినట్టే అని చెప్పాలి. మరి ముందు ముందు సితార ఎంటర్ టైన్మెంట్స్ ఏమైనా అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి.