Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ ప్రేమాయణం అందరికి తెల్సిందే. ఇక ప్రస్తుతం ఈ జంట మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తిని కూడా క్రియేట్ చేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నరేష్- పవిత్ర వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఇక మొదటి నుంచి కూడా నరేష్ కు ఆస్తులు ఎక్కువ గా ఉన్నాయని, అందుకే పవిత్ర వెంటబడుతుందని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక ఒక ఇంటర్వ్యూలో నరేష్.. తన ఆస్తి వివరాలను చెప్పుకొచ్చాడు.
Nenu Student Sir Trailer: కమీషనర్ వర్సెస్ కుర్రాడు.. మరో ‘ఇడియట్’ కాదు కదా
” అవును.. నేను బిలియనీర్ ను.. రిచ్ పర్సన్ ను.. అందులో వారసత్వంగా వచ్చింది ఉంది.. నేను కష్టపడి సంపాదించింది ఉంది. భూములకు ధరలు పెరిగాయి. రూ. 1000 కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. ఏది ఏమైనా ప్రశాంతంగా ఆ డబ్బంతా వైట్ అనే చెప్తాను.. అంతా బ్లాక్ అనుకోనేరు.. ఎక్కడ ఏది కావాలన్నా చూపిస్తాను. ఎంతో బాధ్యతగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను. చాలా ఆస్తి మా అమ్మగారి దగ్గరనుంచి వచ్చింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ వెయ్యి కోట్ల ఫిగర్ గురించి పక్కన పెడితే.. నేను నమ్మేది ఒకటే.. దేవుడు మనకు ఇచ్చింది ఒక జీవితం. మనం హ్యాపీగా ఉండాలి.. మనచుట్టూ ఉన్న పదిమందిని హ్యాపీగా ఉంచాలి. జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి.. సెలబ్రేట్ అంటే.. ప్రతిరోజు ప్రతి ఒక్కరు మనకు సెల్యూట్ చేయాలని కాదు. అందరి కళ్ళలో మనలను చూస్తే ఆనందం కనిపించాలి.. అది నేను చేశాను. అమ్మ దగ్గరనుంచి కూడా అంతే నిజాయితీగా సంపాదించింది ఉంటుంది. ఖర్చు పెట్టేది కూడా లాగే ఉంటుంది. మాకు మేము కొద్దిగా ఖర్చుపెట్టుకొని, పదిమందికి ఏదో చేయాలనుకుంటాం.. చేస్తూ ఉంటాం.. ఆ రకంగా నేను చాలా హ్యాపీ. ఉన్నప్పుడే కదా.. చేయగలం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.