Nenu Student Sir Trailer: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకుగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడిగా బెల్లంకొండ సాయి గణేష్.. స్వాతిముత్యం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మరీ భారీ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా.. డిజాస్టర్ టాక్ ను అయితే తెచ్చుకోకపోవడంవిశేషం. ఇక మొదటి సినిమాతోనే స్వాతిముత్యం అనిపించుకున్న గణేష్.. తన రెండో సినిమాను రిలీజ్ కు దగ్గర చేస్తున్నాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో సాయి గణేష్, అవంతిక దాసాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. SV2 బ్యానర్ పై నాంది సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Takkar Trailer: బొమ్మరిల్లు సిద్దార్థ్ ‘టక్కర్’ పనులు
ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన సుబ్బారావు అనే స్టూడెంట్.. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఓకే ఫోన్ కొనుకుంటాడు. ఆ ఫోన్ కు బుచ్చిబాబు అని పేరుకూడా పెడతాడు. ఇక ఆ ఫోన్ కొన్న ఆనందంలో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఫోన్ లో అనుకోకుండా ఒక హత్యకు సంబంధించిన వీడియో రికార్డ్ అవుతుంది. ఆ హత్య చేసింది సుబ్బారావు అని కాలేజ్ మొత్తం తెలుస్తుంది. అసలు ఆ హత్యకు, తనకు సంబంధం లేదని సుబ్బారావు చెప్పుకొస్తున్నా.. అతడినే దోషిగా నిలబెట్టడానికి కమీషనర్ రంగంలోకి దిగుతాడు. ఇక ఈ హత్య అతను డబ్బు కోసమే చేశాడని, అతని బ్యాంక్ లో కోటి రూపాయలు ఉన్నాయని కమీషనర్ చెప్పుకొస్తాడు. ఫోన్ కొనడానికే తన దగ్గర డబ్బులేని హీరో అకౌంట్ లోకి ఆ డబ్బు ఎలా వచ్చింది..? కమీషనర్.. ఆ కుర్రాడిని ఎందుకు ఇరికించాలని చూస్తున్నాడు..? అసలు హత్య చేసింది ఎవరు..? చంపింది ఎవరిని..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక కుర్రాడు వర్సెస్ కమీషనర్ అనగానే మనకు ఇడియట్ సినిమా టక్కున గుర్తొస్తుంది. అయితే అందులో కూతురును ప్రేమించాడన్న కోపంతో కమీషనర్.. కుర్రాడిపై పగ పెంచుకుంటాడు. మరి ఈసినిమాలో కూడా అలాంటి ట్రాక్ ఏమైనా ఉందా అనేది చూడాలి. ఇక కమీషనర్ గా సముతిరఖని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. జూన్ 2 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాతో చిన్న బెల్లంకొండ హిట్ కొడతాడేమో చూడాలి.
youtu.be/_v6jZV3oTT8