Narayana & Co: ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. కామెడీ అంటే అడల్ట్ జోకులు, జబర్దస్త్ పంచులు అని అర్ధం వచ్చేలా చేసేశారు చాలామంది. ఒకప్పుడు జంధ్యాల లాంటి దర్శకులు కామెడీ సినిమాలు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలా తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సినిమాలు చాలా తక్కువ. ఇక తాజాగా కుటుంబం మొత్తం కలిసి కూర్చోని నవ్వుకునేలా ఒక సినిమా తెరకెక్కింది. అదే నారాయణ అండ్ కో. సుధాకర్ కోమాకుల హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి ప్రసాద్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ సుఖ మీడియా బ్యానర్లపై సుధాకర్ కోమాకుల పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Bhola Shankar: భోళా మ్యానియా షురూ.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే.. ?
ఒక మిడిల్ క్లాస్ ఫాదర్.. ఇద్దరు కొడుకులు. డబ్బు కోసం వాళ్ళు పడే కష్టాలు. దుబాయ్ నుంచి ముంబైకు ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని సేఫ్ గా ఉంచాలి అన్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. ఇక పిల్లి బొమ్మ చుట్టూనే కథ నడుస్తోంది అని తెలుస్తోంది. ఆ పిల్లి బొమ్మను ముంబై చేర్చడానికి నారాయణ అండ్ కో రంగంలోకి దిగుతారు. అసలు ఆ పిల్లి బొమ్మలో ఏముంది..? దానికోసం నారాయణ అండ్ కో ఏం చేశారు..? అనేది ఎంతో వినోదాత్మకంగా చూపించారు. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై ఒక ఆసక్తిని రేకెత్తించారు. ఇకపోతే ఈ సినిమా జూన్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుధాకర్ కోమాకుల హిట్ అందుకుంటాడేమో చూడాలి.