18 Pages Movie: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా జీఏ 2 పిక్చర్స్ రూపొందించిన సినిమా ’18 పేజీస్’. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా ఈ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన…’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను శ్రీమణి రచించారు. ‘ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా.. ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా.. నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా.. నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చేనుగా… రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా’ అంటూ సాగిన శ్రీమణి సాహిత్యం చక్కటి ఫీల్‌ను అందిస్తోంది.
Read Also: Megastar Chiranjeevi: అప్పుడు అవమానించారు.. ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు
కాగా 18 పేజీస్ చిత్రానికి గోపి సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను పృథ్వీ చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. మెలోడీని ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నోస్టాల్జిక్ రొమాన్స్‌ని సుకుమార్ రాశారు. ‘కుమారి 21 ఎఫ్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల చేస్తున్నారు.