Nani Interesting Comments On Dasara Success: మన చిత్రసీమలో కొందరికి ఒక చెడు అలవాటు ఉంది. ఏదైనా ఒక ఫార్ములా సక్సెస్ అయితే.. దాన్నే అనుసరించడానికి ప్రయత్నిస్తారు. ఆ ఫార్ములాని రిపీట్ చేస్తే.. సక్సెస్ మరోసారి పలకరిస్తుందన్న వారి భావన. కానీ.. అలా రిపీట్ చేసిన వారు సక్సెస్ పొందడం ఏమో గానీ, బొక్కబోర్లా పడ్డారు. ‘బాహుబలి’ వచ్చాక అలాంటి జోనర్‌లోనే సినిమాలు చేసి.. కొందరు ఘోర పరాజయాలు చవిచూసిన సంగతి అందరికీ తెలిసిందేగా! అందుకే.. ఒకే ఫార్ములాని పదే పదే రిపీట్ చేయకూడదు. తాను కూడా అలాగే రిపీట్ చేయనని నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
Manisha Koirala: భర్తే శత్రువయ్యాడు, ఆరు నెలలకే అలా జరిగింది.. మనీషా షాకింగ్ కామెంట్స్
తాను ఉద్దేశపూర్వకంగా ఏదీ ప్లాన్ చేయనని.. చివరికి దసరా సినిమా కూడా ప్లాన్ చేసింది కాదని నాని స్పష్టం చేశాడు. తనకు నచ్చింది చేసుకుంటూ పోయానని తెలిపాడు. తాను ఒకే జోనర్‌కి కట్టుబడి ఉండనని, వైవిధ్యం చూపించాలని అనుకుంటానని పేర్కొన్నాడు. ఇప్పుడు దసరా మంచి విజయం సాధించింది కదా అని, మళ్లీ అలాంటి సినిమానే చేయనని కుండబద్దలు కొట్టాడు. బహుశా భవిష్యత్తులో మరో మాస్ సినిమా చేయొచ్చేమో గానీ.. ఇప్పుడప్పుడే దసరా లాంటి సినిమా అయితే చేయనని తేల్చి చెప్పాడు. దసరా మంచి విజయం సాధించినందుకు.. ఒక నటుడిగా తాను చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. కానీ.. తాను శాటిస్ఫై అవ్వలేదని బాంబ్ పేల్చాడు. ఒకవేళ తాను శాటిస్ఫై అయితే.. సోమరిపోతుగా తయారవుతానని, అప్పుడు తాను బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు.
Pulsar Bike Jhansi: టైలర్ తప్పుగా ప్రవర్తించాడు.. తండ్రి ఆ పని చేయమన్నాడు
ఇది సమిష్టి విజయమని.. తనతో పాటు కీర్తి సురేశ్, ఇతర నటీనటులతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి, టెక్నీషియన్లందరూ మూవీ కోసం కష్టపడ్డారని నాని అన్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల ఆడియన్స్ నుండి కూడా మంచి రిపోర్ట్స్ వస్తుండడం తమకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నాడు. మంచి సినిమా చేస్తే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారు అనడానికి దసరా సక్సెస్ మరొక ఉదాహరణ అని చెప్పాడు. ఇక చివరగా.. ఈ సినిమాకి సీక్వెల్ ఉండదని నాని క్లారిటీ ఇచ్చేశాడు.