Keeda Cola : కీడా కోలా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తరుణ్ భాస్కర్…. ఈ యంగ్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్..ఐదేళ్ల గ్యాప్ తర్వాత తన మూడో సినిమా ‘కీడా కోలా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఈ శుక్రవారం రిలీజైన ఈ క్రైం కామెడీ థ్రిల్లర్ అంతగా అలరించలేకపోయింది. దాంతో డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా గురించి కొంతమంది ఫుల్ కామెడీ మూవీ అని చెప్తుంటే మరికొందరు కథేమి లేదని చెప్పేస్తున్నారు..ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటిటి రిలీజ్ ఎప్పుడు వుంటుందా అని తరుణ్ భాస్కర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఆహా వారు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది..
నవంబర్ 3న రిలీజ్ అయిన ఈ చిత్రం నెల రోజుల్లో అంటే డిసెంబర్ మొదటి వారంలో ఓటిటిలో రానుందని సమాచారం. యూత్ ని టార్గెట్ చేసిన ఈ కీడా కోలా సినిమా ఓటిటి లో బాగా వర్కవుట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా టాక్ ఎలా వున్నా కానీ తక్కువ బడ్జెట్ లో అందరు చిన్న ఆర్టిస్టులతోనే తీసిన ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేసింది. కీడా కోలా సినిమా మొదటి రోజే 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా రెండు రోజుల్లో ఈ సినిమా 9.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు చిత్రయూనిట్ ప్రకటించారు.. ఇక నేడు ఆదివారం కావడంతో మరిన్ని కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు సరి కొత్తగా ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో తరుణ్ భాస్కర్ నటించాడు.. అలాగే కీడాకోలా సినిమాలో బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు మరియు రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!