Nani : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ షూటింగ్ టైమ్ లో సౌత్ ప్రేక్షకులపై కొన్ని కామెంట్స్ చేశారు. ‘నేను సౌత్ కు వచ్చినప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడుతారు. వారంతా నన్ను భాయ్ భాయ్ అంటూ పలకరిస్తారు. నాతో ఫొటోలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఆ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నా సినిమాను చూడరు. నాపై ఉన్న అభిమానం థియేటర్లకు తీసుకెళ్లట్లేదు. కానీ సౌత్ సినిమాలను నార్త్ ఆడియెన్స్ ఆదరిస్తారు’ అంటూ సల్మాన్ ఖాన్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై తాజాగా నేచురల్ స్టార్ నాని హిట్-3 ప్రమోషన్స్ లో భాగంగా స్పందించారు.
Read Also : Vaibhav Suryavanshi: ఒక్క సెంచరీ.. 8 రికార్డులు!
‘నార్త్ సినిమాలను సౌత్ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నో సినిమాలు సౌత్ లో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘దిల్ తో పాగల్ హై’ లాంటి సినిమాలు సౌత్ లో మంచి కలెక్షన్లు సాధించాయి. ఇప్పుడు సౌత్ సినిమాలు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అంతకంటే ముందే బాలీవుడ్ సినిమాలను తెలుగులో ఆదరించాం. ఆ విషయాలను అందరూ గుర్తు పెట్టుకోవాలి. సల్మాన్ ఖాన్ చెప్పింది ఇప్పటి పరిస్థితులను బట్టి కావచ్చు. కానీ సినిమా అనేదానికి ప్రాంతీయ బేధం లేదు. సినిమాలు బాగుంటే అందరూ ఆదరిస్తారు’ అంటూ నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Bheems Ceciroleo: భీమ్స్ పేరులో ‘సిసిరోలియో’ అంటే ఏంటో తెలుసా?