Nani : ఈ నడుమ ప్రతి సినిమా ఫంక్షన్ లో కొన్ని రకాల ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి. విలన్ ను కనిపెడితే రూ.10 వేలు ఇస్తామని ఒకరు చెబుతున్నారు. కథ ఊహించి చెప్పిన వారికి బైక్ ఇస్తామని ఒక హీరో అంటున్నాడు. మంచి ప్రశ్న అడిగిన వారికి గోల్డ్ కాయిన్ ఇస్తామంటున్నారు. ఈ సినిమా హిట్ కాకపోతే మళ్లీ సినిమాలు తీయనని ఇంకో నటుడు.. ఇలా రకరకాల ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి. సరే వారంతా చిన్న స్థాయి హీరోలు కాబట్టి తమ సినిమాలను అలా ప్రమోట్ చేసుకుంటున్నారని అనుకుందాం. కానీ ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా ఇలాంటి ఛాలెంజ్ లు, లింకులు పెట్టేస్తున్నాడు. మొన్న కోర్టు సినిమా నచ్చకపోతే తన హిట్-3 మూవీ చూడొద్దని అన్నాడు.
Read Also : Single Trailer : శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ రిలీజ్..
ఇప్పుడు హిట్-3 సినిమా నచ్చకపోతే ఎస్ ఎస్ ఎంబీ29 మూవీ చూడొద్దని చెబుతున్నాడు. అసలు ఇలా ఒక సినిమాకు మరో సినిమాకు లింకులు పెట్టడం ఎందుకో అర్థం కావట్లేదు. ఒక సినిమా కచ్చితంగా బాగుంటుంది చూడండి అంటే ఓకే. కానీ ఒక సినిమా నచ్చకపోతే మరో సినిమాను చూడొద్దని చెప్పడం అవసరమా. ఒకవేళ కోర్టు మూవీ ప్లాప్ అయి ఉంటే.. హిట్-3ని చూడొద్దని చెప్పేవాడా. లేదు కదా. ఇప్పుడు హిట్-3 బాగా లేకపోతే మహేశ్ రాజమౌళి సినిమాను చూడొద్దు అని చెప్పడం ఎందుకు. హిట్-3 బాగా లేకపోతే మహేశ్ మూవీ చూడకుండా ఉంటారా. ఇలాంటి ఛాలెంజ్ లతో సినిమాను ప్రేక్షకులు చూడరు కదా. సినిమాలో దమ్ము ఉంటే కచ్చితంగా చూస్తారు. లేకపోతే లేదు. ఆ విషయం నానికి తెలిసినా.. ఇలాంటి ఛాలెంజ్ లు చేసి తన స్థాయి తగ్గించుకోవడం ఏంటో అర్థం కావట్లేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.