Nani: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో నాని ప్రమోషన్స్ మాత్రం ఓ రేంజ్ లో మొదలుపెట్టాడు. అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ.. సినిమాపై హైప్ తీసుకొస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే.. ప్రమోషన్స్ తో సగానికి సగం పాజిటివ్ టాక్ వచ్చేలా చేశాడు నాని. ప్రమోషన్స్ అంటే.. ఏ రేంజ్ లో చేయాలో అన్ని చేస్తూ వస్తున్నాడు. మిగతా స్టార్ హీరోలతో ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్స్ తో రీల్స్, ఫ్యాన్స్ మీట్స్.. ఇలా ఒక్కటి కూడా వదలడం లేదు.
Anchor Suma: ఆ షోలో సుమను ఒక ఆట ఆడుకున్న బ్రహ్మాజీ..
ఇక తాజాగా నాని.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను మీట్ అయ్యాడు. బెంగుళూరు ప్రమోషన్స్ కోసం వెళ్లిన నాని.. శివన్నను ఆయన నివాసంలో కలిశాడు. ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. హాయ్ నాన్న సినిమా గురించి నాని.. శివన్నకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాపై నాని చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలంటే మరో రెండు రోజులు ఎదురుచూడాల్సిందే.