Site icon NTV Telugu

Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’కు బ్రేక్ ..కారణం ఏంటంటే?

Nani's The Paradise Vs Bloody Romeo

Nani's The Paradise Vs Bloody Romeo

Nani Bloody Romeo Postponed: నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన ‘బ్లడీ రోమియో’ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పదే పదే ఆలస్యం అవుతుండటమే ఇప్పుడు ఇతర ప్రాజెక్టులపై ప్రభావం చూపుతోంది. ‘ది పారడైజ్’ చిత్రాన్ని ముందుగా 2026 సమ్మర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అది కాస్తా ఆగస్టు 21కి మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ తేదీకి కూడా సినిమా సిద్ధమవ్వడం కష్టమేనని టాక్.

Also Read :Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..

నాని తన పూర్తి కాల్ షీట్స్ ‘ది పారడైజ్’కే కేటాయించాల్సి రావడంతో, సుజీత్ దర్శకత్వంలో రావాల్సిన ‘బ్లడీ రోమియో’ పట్టాలెక్కడం మరింత ఆలస్యం కానుంది. నిజానికి ‘బ్లడీ రోమియో’ను 2026 చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడమే గగనంగా మారింది. దీనివల్ల 2026 టార్గెట్ పూర్తిగా మిస్ అయ్యి, సినిమా 2027కి వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాని నుంచి ఒకే ఏడాది రెండు భారీ సినిమాలు చూడాలని ఆశపడ్డ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా నిరాశ కలిగించే విషయమే. అయితే సుజీత్ తన స్క్రిప్ట్‌పై మరికొంత వర్క్ చేసేందుకు ఈ సమయాన్ని వాడుకోనున్నారని సమాచారం.

Exit mobile version