మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి.. సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో.. వంటి హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఎప్పుడో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అప్పటికే మహేష్ ‘సర్కారు వారి పాటకు’ కమిట్ అవడంతో పాటు.. పాండమిక్ వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతు వస్తోంది. ఇక ఇప్పుడు మహేష్ ఫ్రీ అవడంతో.. ఈ సినిమాకు రంగం సిద్దమవుతోంది. కొన్ని నెలల క్రితం లాంచనంగా మొదలైన ఈ సినిమాను త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక త్రివిక్రమ్ సినిమా అంటేనే.. సెకండ్ హీరోయిన్, సీనియర్ స్టార్స్, సీనియర్ హీరోయిన్లు.. యంగ్ హీరోలు ఉండాల్సిందే. తన లాస్ట్ ఫిల్మ్‌లో సుశాంత్, నవదీప్ వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. అలాగే సీనియర్ బ్యూటీ టబు కూడా నటించింది. అయితే సెకండ్ హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో.. మహేష్ సినిమాలో కూడా పలువురు సీనియర్ బ్యూటీలు నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇందులోను మరో హీరో కీలక పాత్రలో నటించబోతున్నాడని టాక్. అందులో భాగంగా.. న్యాచురల్ స్టార్ నాని పేరు కూడా వినిపించింది. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఇక ఇప్పుడు నందమూరి హీరో తారక రత్న పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో కనిపించే కీ రోల్ కోసం తారక రత్నను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో తారక రత్న కనిపించబోతున్నాడట. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. హీరోగా సక్సెస్ కాలేకపోయిన తారక రత్నకు.. మహేష్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు.