నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించారు. టికెట్ రేట్స్ తక్కువ ఉన్న టైంలో రిలీజ్ అయ్యి, రిపీట్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించింది. ఇంటర్వెల్ నుంచి బాలయ్య ఆడిన రుద్రతాండవం చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. బాలయ్య సినిమా 150 కోట్ల వరకూ గ్రాస్ రాబడుతుందని కలలోనైన ఊహించారా? అది కూడా 20, 30 రూపాయల టికెట్ రేట్స్ తో… ఇంపాజిబుల్ కదా. ఆ ఇంపాజిబుల్ నే నిజం చేసి చూపించింది అఖండ సినిమా. అఖండ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్స్… బోయపాటి శ్రీను డైరెక్షన్, బాలయ్య టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్, తమన్ ఇచ్చిన థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ మూడు అంశాలు ‘అఖండ’ సినిమాని ఆడియన్స్ కి దెగ్గర చేశాయి. ఇదే సినిమాని ఇంకొకరు రీమేక్ చేయాలి అంటే అయ్యే పని కాదు, పైగా బాలయ్య చేసిన హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ ని మాచ్ చేయడం అనేది అసలు అయ్యే పనే కాదు. బాలయ్య, ‘అఘోర’ క్యారెక్టర్ లో చూపించిన టెంపోని మాచ్ చేయడం ఎవరికైనా కష్టమే. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్న ‘పెన్ స్టూడియోస్’ అఖండ సినిమాని హిందీలో డబ్ చేసి జనవరి 20న ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తున్నారు. ప్రమోషన్స్ మొదలుపెట్టిన పెన్ స్టూడియోస్, అఖండ హిందీ ట్రైలర్ లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని నార్త్ అభిమానులు ఎగబడి చూస్తున్నారు.
కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, కాంతార సినిమాలు నార్త్ లో అద్భుతంగా ఆడడానికి ముఖ్యమైన కారణం అందులో హిందుత్వం ఎక్కువగా ఉండడం. ఎక్కువ ఉంటేనే నార్త్ ఆడియన్స్ ఈ సినిమాలకి వంద కోట్లు ఇచ్చారంటే, సినిమానే హిందుత్వం పైన తెరకెక్కింది అంటే నార్త్ ఆడియన్స్ అఖండ మూవీకి అంతకు మించే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం నార్త్ లో ట్రెండ్ ని దృష్తిలో పెట్టుకోని, సినిమా ఇంటర్వెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ ఉన్న కంటెంట్ ని కన్సిదర్ చేసి చూస్తే అఖండ సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యి వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం. ఇక క్లైమాక్స్ లో వచ్చే శివుడు విజువల్ ఎఫెక్ట్ కి, ఆ టైంలో తమన్ కొట్టిన మ్యూజిక్ కి థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకలు రావడం గ్యారెంటీ. ఈ ఒక్క సీన్ చాలు నార్త్ ఆడియన్స్ అఖండ సినిమాని నెత్తిన పెట్టుకోని చూడడానికి. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీ నార్త్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబడితే బాలయ్య-బోయపాటి శ్రీనులు త్వరలో అనౌన్స్ చెయ్యనున్న ‘అఖండ 2’కి పాన్ ఇండియా రీచ్ వస్తుంది.