నటసింహం నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించారు. టికెట్ రేట్స్ తక్కువ ఉన్న టైంలో రిలీజ్ అయ్యి, రిపీట్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించింది. ఇంటర్వెల్ నుంచి బాలయ్య ఆడిన రుద్రతాండవం చూడడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. బాలయ్య సినిమా 150 కోట్ల వరకూ గ్రాస్ రాబడుతుందని కలలోనైన ఊహించారా? అది కూడా 20, 30 రూపాయల టికెట్ రేట్స్ తో… ఇంపాజిబుల్…