Taraka Rama: ఐకానిక్ థియేటర్ ఏషియన్ తారకరామ మళ్లీ ఓపెన్ కావడానికి సిద్ధమవుతోంది. రెండు నెలల క్రితం రీమోడల్ కోసం మూసివేసిన ఈ థియేటర్ ను రే ఓపెన్ చేయడానికి ముహూర్తం కుదిరింది. శరవేగంగా రెన్యువేషన్ పనులను ముగించుకొని డిసెంబర్ 14 నుంచి థియేటర్ ను ఓపెన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాచిగూడ లో ఉన్న ఐమాక్స్ లలో తారక రామ ఒకటి.. ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్న ఈ థియేటర్ ను బాలయ్య.. ఏషియన్స్ గ్రూప్స్ మరియ సురేష్ బాబుతో కలిసి ఏషియన్స్ తారకరామ సినీప్లెక్స్ గా తీర్చిదిద్దారు.
ఇక ఈ థియేటర్ ను రీ మోడల్ చేయడానికి పూనుకున్న బాలయ్య.. ఇప్పటి తరానికి తగట్టుగా మోడల్ గా తయారుచేయిస్తున్నారు. ఇప్పటివరకు 2k ప్రొజెక్షన్ తో ఉన్న స్క్రీన్ ను ఇప్పుడు 4k ప్రొజెకక్షన్ గా మార్చారు. ఇంకా సీటింగ్ కూడా తగ్గించి.. మల్టీప్లెక్స్ లా మార్చారని టాక్. ఇక డిసెంబర్ న ఈ స్క్రీన్ లో మోట్ మొదటిగా పడబోయే బొమ్మ అవతార్ అని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.