Nandamuri Balakrishna: మంచు వారబ్బాయి విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న కన్నప్ప చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద విష్ణు మంచు నిర్మిస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కన్నప్ప పోస్టర్‌తో అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా కన్నప్ప మూవీని తెరకెక్కిస్తున్నారు.
మంచు విష్ణు హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పుడు వచ్చిన పూర్వ వైభవాన్ని ఈ సినిమా ద్వారా తేవాలని ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా.. స్టార్ హీరో అయితే చాలు.. కన్నప్పలోకి తీసుకొచ్చేస్తున్నాడు. విష్ణు పై అభిమానుమతోనో, మోహన్ బాబు పై ఉన్న గౌరవంతోనో.. వారు కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఇక ఇంతమంది స్టార్లు రంగంలోకి దిగారు.. ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టారు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. విష్ణు ఇంకా స్టార్లను తీసుకురావడం ఆపలేదు. అందులో భాగంగానే నందమూరి బాలకృష్ణను కూడా కన్నప్పలోకి లాగాలని చూస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఒక కీలక పాత్ర కోసం ఇప్పటికే విష్ణు.. బాలయ్యను సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనికి బాలయ్య ఒప్పుకున్నాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య NBK109 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ బాలయ్య ఈ సినిమా ఒప్పుకున్నట్లైతే.. మంచు విష్ణు భారీ ప్లాన్ సక్సెస్ అయిన్నట్లే అని చెప్పాలి. మరి ఈ సినిమాతో మంచు విష్ణు అనుకున్నది సాధిస్తాడేమో చూడాలి.