డైరెక్టర్ అనీల్ రావిపూడి కామెడీ టింజ్ తో, నందమూరి నట సింహం బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి తెరకెక్కుతున్న సినిమా ‘భగవంత్ కేసరి’. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీలో బాలయ్య పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి అంటూ టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి-బాలయ్య, సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య, తెలంగాణా డైలాగ్స్ చెప్తూ కొత్తగా కనిపించాడు. పైసా వసూల్ సినిమాలో కూడా బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పాడు కానీ మరీ కొర్ తెలంగాణ బాలయ్య-కాజల్ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైమ్ కాబట్టి వీరి ఆన్ స్క్రీన్ ఫ్రెష్ గా ఉండనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భగవంత్ కేసరి సినిమాలో ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుగుతుంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో, పెళ్లి సెటప్ లో కాజల్-శ్రీలీల-బాలయ్య పైన ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. సెలబ్రేషన్ మోడ్ లో ఉండే ఈ సాంగ్ కి భాను మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. సాంగ్ షూటింగ్ నుంచి బాలయ్య, కాజల్ ఫొటోస్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బాలయ్య సినిమా అనగానే ఫుల్ జోష్ లోకి వచ్చే థమన్, భగవంత్ కేసరి కోసం ఎలాంటి సెలబ్రేషన్ సాంగ్ ఇచ్చాడో తెలియాలి అంటే అక్టోబర్ 19 వరకూ వెయిట్ చేయాల్సిందే. దాదాపు అయిదు రోజుల లాంగ్ ఫెస్టివల్ పీరియడ్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇదే టైంలో లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లియో కూడా రిలీజ్ కానుంది.