టాలీవుడ్ లో స్టార్ హీరోల ప్రమోషన్స్ కన్నా హీరోల భార్యలు చేసే ప్రమోషన్స్ అల్టిమేట్ గా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. మెగా కోడలు ఉపాసన, ఘట్టమనేని కోడలు నమ్రత గురించి సోషల్ మీడియా లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తలకు వెన్నుదండుగా ఉండి వారి ప్రమోషన్స్ లో సగభాగం వీరే చేస్తారు. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే ఫస్ట్ షో లో ఉపాసన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. చరణ్ కి సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకునేది ఉపాసననే మరి.. ఇక మహేష్ భార్య నమ్రత అయితే మహేష్ కు సంబంధించిన ప్రతి విషయంలో ఆమె హస్తం లేకుండా ఉండదు. అయితేథియేటర్ కు వెళ్లి సినిమా చూసే విషయంలో మాత్రం ఉపాసనను నమ్రత ఫాలో అవుతుంది అంటున్నారు అభిమానులు.
‘సర్కారువారి పాట’ ఫస్ట్ డే ఫస్ట్ షో కు నమత్ర ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమాను ఎంజాయ్ చేసింది. అంతేకాకుండా ప్రతి థియేటర్ కు వెళ్లి అభిమానవుల రెస్పాన్స్ ను కనుక్కొని రిలీజ్ తర్వాత ఆ సినిమా ప్రచారం పనుల్ని భుజాన వేసుకోంది. ఇది నిజంగా నమ్రతకి కొత్త ఎక్స్ పీరియన్స్ అని చెప్పాలి. ఇప్పటి వరకూ నమ్రత సింగిల్ స్క్కీన్ థియేటర్ కి వచ్చి సినిమా చూసింది లేదు. అందులోనూ ఇలా అందరి ముందు కనిపించడం చాలా రేర్.. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకోవడం వలన ఆ డివైడ్ టాక్ ను చెరిపివేయడానికి నమ్రత యి విధంగా చేస్తుందా ..? అని కొందరు అనుమానపడుతున్నారు. ఏది ఏమైనా భర్తలకు సపోర్ట్ చేస్తూ వారి బరువు బాధ్యతల్లో భార్యలుగా తమ వంతు సహాయం చేస్తున్న ఈ సతీమణులను అభిమానులు పొగిడేస్తున్నారు.