లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నాగశౌర్య ఆ మధ్య యాక్షన్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అది అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ పై దృష్టి పెట్టాడు. అలా రూపుదిద్దుకున్నదే ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా. అనీశ్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదే నెల 23న విడుదల కాబోతోంది. ఈ మూవీతో షెర్లీ సెటియా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
శనివారం ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కృష్ణ జీవితం ఉద్యోగ నిమిత్తం సిటీకి వెళ్ళి తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందనేదే ఈ చిత్ర కథ. ట్రైలర్ ఆద్యంతం పంచ్ డైలాగ్స్ తో సాగింది. సత్య, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిశోర్ సినిమాలో బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ అందిస్తారనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కల్పించింది. హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్, విలన్ తో యాక్షన్, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంటర్ టైన్ మెంట్… మొత్తం కలగలిపి నవరసాలు ఈ సినిమాలో ఉంటాయనిపిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చిన ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. మొత్తం మీద ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీపై ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు పెరగడం ఖాయం.