చివరిగా ‘బంగార్రాజు’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది గోస్ట్” పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దుబాయ్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ని సినిమా యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ వర్కింగ్ స్టిల్స్ ప్రకారం నాగార్జున సోనాల్ చౌహాన్ జంటగా నటిస్తున్నారు.
Read Also : Chiranjeevi : ఆ తెలుగు వైద్యుడి కోసం మెగాస్టార్ ఎమోషనల్
మరోపక్క దుబాయ్ లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసినట్లు సమాచారం. థాయిలాండ్ కు చెందిన ఫేమస్ స్టంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఆ మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ త్వరలోనే తెరకెక్కించబోతున్నారు. నాగార్జున ఒకపక్క బిగ్ బాస్ నాన్ స్టాప్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రమంలో అవసరమైతే హైదరాబాద్ వచ్చి మళ్లీ షూటింగుకు హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏడాది చివరి లోపు సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.