Manmadhudu: ‘మన్మథుడు’ మళ్ళీ వచ్చేస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna’s Manmadhudu Re-release On August 29th: ఈ మధ్య కాలంలో గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా రీ రిలీజ్ చేస్తున్న సినిమాలు మళ్ళీ మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ఈ కోవలోనే నాగార్జున హీరోగా కె విజయ భాస్కర్ డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ‘మన్మథుడు’ ఆగస్టు 29న రీ-రిలీజ్ కాబోతుంది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ నెల 29న పుట్టినరోజు జరుపుకోనున్న క్రమంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. నాగార్జున బర్త్ డేకి అభిమానులతో పాటు సినీ ప్రియులకు కూడా సర్ప్రైజ్ ఇస్తూ నాగార్జున ఎవర్గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన్మధుడు’ని ఆగస్ట్ 29న రీ-రిలీజ్ చేస్తున్నారు. ‘మన్మథుడు’ లో నాగార్జున ఒక యాడ్ ఏజెన్సీ CEO అభి పాత్రను పోషించగా కొన్ని కారణాల వలన అమ్మాయిలను ఇష్టపడని పాత్రలో ప్రేక్షకులను అలరించారు.
Krishna Chaitanya: రోటరీ క్లబ్ మనోజ్ఞ బ్రాండ్ అంబాసిడర్ గా ‘కృష్ణ చైతన్య’
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించగా, కె విజయ భాస్కర్ స్క్రీన్ ప్లేతో అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఇక మన్మథుడు ఒక అందమైన ప్రేమ కథగా వచ్చి హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్లో కూడా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు మరో హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మొదలైన ప్రముఖ హాస్యనటులు అలరించగా ఆ కామెడీ సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిందని చెబుతూ ఉంటారు. ఇక మన్మథుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించనుంది అనేది చూడాలి మరి.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!