War 2 Vs Coolie : ఆగస్టు 14న టాలీవుడ్ లో బిగ్గెస్ట్ వార్ జరగబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 రిలీజ్ కాబోతోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. వాస్తవానికి వార్-2లో ఇద్దరు హీరోలున్నారు. కూలీ సినిమాలో రజినీకాంత్ మెయిన్ హీరో. నాగార్జున ఇందులో విలన్ పాత్రలో చేస్తున్నాడు. కానీ ఈ రెండు సినిమాల మధ్య పోటీని కొందరు నాగార్జున, ఎన్టీఆర్ మధ్య పోటీ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ హీరోగా సినిమా చేస్తున్నారు. నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాంటప్పుడు వీరిద్దరి మధ్య పోటీ ఎలా అవుతుందంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కానీ వార్-2 కంటే తెలుగులో కూలీ సినిమాకే ఎక్కువ బజ్ ఏర్పడటం విశేషం.
Read Also : PVNS Rohit : మొన్నే నేషనల్ అవార్డు.. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకున్న సింగర్
అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కూలీ రికార్డులు బద్దలు కొడుతోంది. కానీ వార్-2కు ఎన్టీఆర్ సినిమా స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగట్లేదు. దీంతో తెలుగునాట కూలీ సినిమాకు జరుగుతున్న బిజినెస్ మొత్తం నాగార్జున వల్లే అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. రజినీకాంత్ కు తెలుగులో ఎంత మార్కెట్ ఉన్నా.. ఈ సినిమాకు వేరే లెవల్ బిజినెస్ జరిగింది. దానికి కారణం నాగార్జున ఉండటం. ఇప్పుడు కూలీ సినిమా గనక తెలుగులో ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంటే మాత్రం ఆ క్రెడిట్ నాగార్జున ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ. అప్పుడు వార్-2లో ఎన్టీఆర్ పరిస్థితి ఏంటనేది తెలియట్లేదు. అదే జరిగితే నాగార్జున ముందు ఎన్టీఆర్ తేలిపోయాడు అంటూ నెగెటివ్ ప్రచారం చేయడానికి యాంటీ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఎటు చూసినా ఈ రెండు సినిమాల మధ్య జరుగుతున్న వార్ ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జునగా క్రియేట్ అవుతోంది.
Read Also : Ashish Vidyarthi : అలాంటి పాత్రలు ఇస్తేనే సినిమాలు చేస్తా.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్