ఇటీవలే 69వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా… బెస్ట్ యాక్టర్ అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేసాడు. అయితే ఇంతకన్నా ముందే అక్కినేని కింగ్ నాగార్జున రెండు నేషనల్ అవార్డ్స్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రప్పించాడు. 1997లో నిన్నే పెళ్లాడట సినిమాకి గాను నాగార్జున ప్రొడ్యూసర్ గా నేషనల్ అవార్డుని గెలుచుకున్నాడు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరిలో నిన్నే పెళ్లాడత సినిమాకి ఈ నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాతి ఏడాదినే నాగార్జున స్పెషల్ మెన్షన్ కేటగిరిలో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. 1998లో అన్నమయ్య సినిమాకి గానూ నాగార్జునకి స్పెషల్ మెన్షన్ లిస్టులో ఈ నేషనల్ అవార్డ్ వచ్చింది. రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ అన్నమయ్య తెలుగులో సినిమాల్లో ఒక క్లాసిక్ గా నిలిచింది. ఈ మూవీని ఏ కమర్షియల్ హీరో చేయడు, అలాంటిది నాగార్జున అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.
ఆ విధానంగా రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రప్పించాడు నాగార్జున. నేషనల్ అవార్డ్స్ మాత్రమే కాదు 8 నంది అవార్డ్స్ కూడా నాగార్జున ఖాతాలో ఉన్నాయి. నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య, ప్రేమకథ, యువకుడు, సంతోషం, మన్మథుడు, శ్రీ రామదాసు, రాజన్న సినిమాలకి నాగార్జున నంది అవార్డ్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇందులో బెస్ట్ యాక్టర్ గా అన్నమయ్య, శ్రీరామదాసు, సంతోషం సినిమాలకి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డుని గెలుచుకోగా… మిగిలిన నంది అవార్డ్స్ ప్రొడ్యూసర్ గా, స్పెషల్ జ్యురి కేటగిరీల్లో నాగార్జునకి వచ్చాయి. ఇవే కాదు మూడు సైమా, ఒక ఐఫా అవార్డ్ కూడా నాగార్జున లిస్టులో ఉంది. ఇక ఫిల్మ్ ఫేర్, స్టార్ మా అవార్డ్స్ ల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ప్రయోగాలు చేసి కూడా నాగార్జున ఇన్ని అవార్డ్స్ ని సొంతం చేసుకోవడం గొప్ప విషయం.