Nagarjuna Ex wife Lakshmi latest Photos: అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా జనం ముందు నిలచిన నాగచైతన్య అభిమానుల మదిని దోచుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ఆయన తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. తొలి చిత్రం ‘జోష్’ మొదలు మొన్న వచ్చిన ‘కస్టడీ’ దాకా నాగచైతన్య కెరీర్ గ్రాఫ్ లో ప్రేమకథలే ప్రధాన పాత్ర పోషించాయి. లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్న నాగచైతన్య అప్పుడప్పుడూ భిన్నంగానూ ప్రయత్నించారు. నాగచైతన్య 1986 నవంబర్ 23న హైదరాబాద్ లో జన్మించారు. తండ్రి వైపు అక్కినేని నాగేశ్వరరావుకు మనవడు, తల్లివైపున స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు మనవడే! ఇలా రెండు ప్రముఖ కుటుంబాలకు చెందిన నాగచైతన్యకు తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేష్ లాగే నటుడవ్వాలనే అభిలాష బాల్యం నుంచి ఉండేది.
Allu Arjun: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ఎస్పీపై చర్యలకు ఆదేశం
పైగా ఎటు చూసినా సినిమా వాతావరణం అలవాట అవ్వడం వల్ల ఎప్పుడు ఎప్పుడు తెరపై హీరోగా కనిపించాలన్న ఆసక్తి ఉండేదనే విషయాన్ని తన తొలి చిత్రం ‘జోష్’ ఆడియో వేడుకలో ఎంతో ఉత్సాహంగా చెప్పారు. అయితే నాగచైతన్య తల్లి లక్ష్మి నాగార్జునకి తొలి భార్య.. నాగచైతన్య వాళ్ల అమ్మ బయటికి వచ్చేదే చాలా తక్కువ. ఆమెను చూసిన వాళ్లు కూడా తక్కువే. రామానాయుడు కూతురు అయిన లక్ష్మి.. చాలా ఏళ్ల కిందే నాగార్జునతో విడిపోయింది. నాగచైతన్య కూడా ఆమెతోనే పెరిజి పెద్దయ్యాక తండ్రి దగ్గరకు షిఫ్ట్ అయ్యాడు. చై పెళ్లి విషయం తెర మీదకు వచ్చే వరకూ దాదాపు అఙ్ఞాతంగానే ఉండిపోయారు లక్ష్మి. తండ్రి నాగార్జున గురించి తెలుసు కానీ చైతు తల్లి లక్ష్మి గురించి ఎవరికీ తెలియదు. కొద్ది సంవత్సరాల క్రితమే రామానాయుడి కూతురైన లక్ష్మి గురించి చైతూ మదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు తెలిపాడు. ఇక ఇప్పుడు ఆమెతో కలిసి ఉన్న పిక్ షేర్ చేశాడు.