EC Serious on Police officers about Allu Arjun Nandyal Tour: పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న స్నేహితుతు శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. గంటన్నరకు పైగా అక్కడే ఉండి మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి తిరుపతి వెళ్లారు. అల్లు అర్జున్ రాక గురించి వైసీపీ నేతలు, అల్లు అర్జున్ పీఆర్ టీం ముందే సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఆయన్ని చూసేందుకు వేల మంది అభిమానులు ఎమ్మెల్యే రవి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే, ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం వ్యక్తిగతమే అయినా, భారీగా జనం వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అనుమతి తీసుకోవాలి. కానీ అనుమతులు తీసుకోకుండా భారీ జన సమీకరణ చేసినందుకు కేసు నమోదు చేయాలని టూ టౌన్ పోలీసులను ఆదేశించారు ఆర్వో, జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి.
Sneha: ఒక్కసారి వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోను.. అందుకే.. స్నేహ షాకింగ్ కామెంట్స్
ఈ మేరకు అల్లు అర్జున్ తో పాటు ఎమ్మెల్యే శిల్పారవిపై కూడా ఐపీసీ సెక్షన్ 188 కేసు నమోదు చేశారు సీఐ రాజారెడ్డి. అయితే నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ అధికారుల మీద కూడా పడింది. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని డీజీపీకి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది సీఈసీ. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయని. విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల పోలీసులపై మండిపడిందని అంటున్నారు. నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డీ , డీఎస్పీ, టూటౌన్ సీఐపై చార్జిషీట్ నమోదు చేయాలని ఆదేశించి, అరవై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అలాగే తమ అనుమతి లేకుండా కేసును క్లోజ్ చేయవద్దని పేర్కొన్నట్టు తెలుస్తోంది.