Akkineni Nagarjuna: గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగార్జున. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించింది లేదు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తో ఒక సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కానీ, ఆ సినిమాను రవితేజ లాగేశాడు. దీంతో నాగార్జున మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇక తాజాగా నాగార్జున వెండితెర నుంచి ఓటిటీకి వస్తున్నట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ వారు నాగార్జునతో ఒక వెబ్ సీరీస్ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే నాగ్ ను సంప్రదించడం… ఆయన కూడా ఓకే అనడం జరిగాయని టాక్ నడుస్తోంది. ఒక 10 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ లో నాగ్ హీరోగా నటిస్తున్నాడట. ఈ సిరీస్ తో నాగార్జున డిజిటల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతుందంట. అంతేకాదు .. మన్మథుడు కు తగిన కథతోనే సిరీస్ మొదలుకానుందని, నాగ్ రైటర్స్ కూడా ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు.
Rashmika: మేనేజర్ మోసం.. స్పందించిన రష్మిక
ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు ఆపేసి డిజిటల్ మీడియా మీద పడితే .. మళ్లీ సినిమాలు చేయడం కష్టమని కొందరు అంటుండగా.. మిగతా హీరోలు.. ఒకపక్క సినిమాలు చేస్తూ.. సిరీస్ లు చేస్తున్నారు .. మీరు కూడా అలానే చేయమని సలహాలు ఇస్తున్నారు. ఇక నాగ్.. ఓటిటీకే పరిమితమవుతాడా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.