Nagarjuna asks for samantha in bigg boss 7 House : బిగ్ బాస్ సెవెన్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. తన ఖుషి సినిమాలోని సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి క్లోజ్ చేసిన వెంటనే నాగార్జున వచ్చి సీరియస్ అయ్యాడు. నా స్టేజి మీద మీరేం చేస్తున్నారు అంటూ డాన్సర్లను అక్కడి నుంచి వెళ్లగొట్టిన తర్వాత విజయ్ తో మాట్లాడాడు.. చాలా ఖుషి ఖుషిగా కనిపిస్తున్నావ్ ఏంటి అని నాగార్జున అడిగితే చాలా కాలం తర్వాత నా సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి సినిమా చూసిన బయటకు వస్తున్న వారు ఖుషిగా ఉన్నారు కాబట్టి తాను కూడా ఖుషి ఖుషిగా కనిపిస్తున్నానని అన్నారు. ఖుషి గా కనిపిస్తున్నాను అని చెబుతున్నాను కానీ చాలా రిలీఫ్ అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తన మాజీ కోడలు ఖుషి సినిమా హీరోయిన్ సమంత గురించి నాగ్ ప్రస్తావించడం ఒక్కసారిగా అందరికీ షాక్ కలిగించింది. వాస్తవానికి ఈ విషయాన్ని ప్రోమోలోనే రివీల్ చేశారు కానీ లైవ్ లో కూడా నాగార్జున అడగడం ఒక్కసారిగా అందరూ థ్రిల్ గురయ్యారు.
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 లైవ్ అప్డేట్స్
సమంత ప్రస్తుతానికి అమెరికాలో ఉందని ఆమె సినిమాని అమెరికాలో ప్రమోట్ చేసేందుకు అక్కడికి వెళ్లిందని ఆమె ఆరోగ్యం కూడా బాగోకపోవడంతో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుందని విజయ్ చెప్పుకొచ్చాడు. మరో రెండు రోజుల్లో ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉందని వచ్చిన తర్వాత ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉందని విజయ్ చెప్పుకొచ్చాడు. నువ్వు ఒక మంచి నటుడివి ఆమె ఒక ఫెంటాస్టిక్ నటి మీరిద్దరూ పోటాపోటీగా చేసి ఉంటారు. అప్పుడు ఎవరు ఎవరిని డామినేట్ చేశారు అని అడిగితే నేను డామినేట్ చేయడానికి ట్రై చేశాను కానీ ఎప్పుడూ భార్యలే డామినేట్ చేస్తారు అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. దీంతో సినిమా స్టోరీ చెబుతున్నావా ఏమిటి అంటే మీ వైఫ్ దగ్గర ఎవరు డామినేట్ చేస్తుంటారు అని నాగ్ ను అడిగాడు విజయ్. తానే డామినేట్ చేస్తానని నాగార్జున చెప్పుకొచ్చాడు.
ఆడియన్స్ తమ ఇద్దరిని కలిసి చూడటం బావుందని, తనకు ఏం మాయ చేసావే సినిమా చూసినప్పటి నుంచి సమంత అంటే ఇష్టం అని ఆమెతో పనిచేయాలని ఎప్పుడూ అనుకునేవాడినని విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా నాగార్జున ప్రొఫెషనలి జం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి నాగార్జున కుమారుడు నాగచైతన్య సమంత ఒకప్పుడు భార్యాభర్తలు గా ఉండేవారు విడిపోయిన తర్వాత ఒక్కరి అభిమానులు మరొకరి మీద దుమ్మెత్తి పోసిన పరిస్థితులు కనిపించాయి. కానీ వారంతా బాగానే ఉంటారని తాజాగా జరిగిన ఎపిసోడ్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. కాబట్టి వారు వారు బాగానే ఉన్నారు సోషల్ మీడియాలో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. నాగార్జున ఇప్పుడు కలవలేదు ఒకవేళ కలిసి ఉన్నా ఇదేవిధంగా రిసీవ్ చేసుకుని ఉండేవాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.