Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Vamsi: యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్, ఫేక్ నంబర్ల వ్యవహారంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మొహమాటంగా రియాక్ట్ అయ్యారు. ఇటీవల చిత్రసీమలో పాటలకు పెయిడ్ వ్యూస్ కొంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్న నేపథ్యంలో, తమ సినిమా పాట సాధించిన 10 మిలియన్ల వ్యూస్‌పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తమ ఆదర్శ కుటుంబం సినిమా నుంచి రిలీజ్ ‘నారాయణమ్మ’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్‌పై నాగవంశీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఈ పాటకు ఆన్లైన్లో విపరీతమైన ఆదరణ దక్కి ఇప్పటికే 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ నేనేమీ డబ్బులు ఖర్చుపెట్టి ఆ వ్యూస్‌ను కొనలేదు. ప్రస్తుతం ఒక సాంగ్‌కు డబ్బులు పోసి వ్యూస్ కొనేంత శక్తి, సీన్ నా దగ్గర లేవు. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా చూసి ఎంజాయ్ చేయడం వల్లే ఆ నంబర్స్ వచ్చాయి తప్ప ఇందులో ఎలాంటి ఫేక్ వ్యవహారాలు లేవు” అని కుండబద్దలు కొట్టారు.
ఈ పాట పాత రేలంగి పాట రీమిక్స్ అనే చర్చపై కూడా నాగవంశీ స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చారు. “ఇది రీమిక్స్ కాదు, నాటి అద్భుతమైన పాటను నేటి తరం అభిరుచికి అనుగుణంగా ఫ్రెష్‌గా అందించిన వెర్షన్ మాత్రమే. ఆ విషయంలో దాపరికం ఏమీ లేదు. గతంలో ‘అ ఆ’ సినిమాను ఒక పాపులర్ నవల ఆధారంగా తీసి నేటి తరానికి మెచ్చేలా చూపించలేదా? అలాగే ఈ పాటను కూడా సరికొత్తగా ప్రెజెంట్ చేశాం. ఈ తరం కుర్రాళ్లకు ఆ పాత పాట గురించి ఎంతవరకు తెలుసు? కేవలం వేలెత్తి చూపించడానికే కొందరు ఇలాంటి అంశాలను వెతుకుతారు తప్ప ప్రేక్షకులు పాటను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు” అని తేల్చిచెప్పారు. పాటకు మంచి బజ్ వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ వాయిదా వేయడంపై వస్తున్న సందేహాలను కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని నాగవంశీ అంగీకరించారు. “రాజమౌళి గారైనా, త్రివిక్రమ్ గారైనా, సుకుమార్ గారైనా సరే.. నెటిజన్ల నుంచి వచ్చే ట్రోల్స్‌కు జాగ్రత్త పడక తప్పదు. సినిమాను మా బిడ్డలా భావిస్తాం, దానిపై నెగెటివిటీ రాకూడదనే ఉద్దేశంతోనే టైం తీసుకుంటున్నాం. హడావుడిగా రిలీజ్ చేసి 80 శాతం అవుట్‌పుట్ ఇవ్వడం కంటే, కాస్త ఆలస్యమైనా 100 శాతం క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తేవడమే మా ప్రాధాన్యత” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?