Naga Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో సూర్యదేవర నాగవంశీ ఒకడు. గతకొంతకాలంగా నాగవంశీ స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ హిట్ నిర్మాతగా మారాడు. మనసులో ఉన్న విషయాన్నీ నిర్మొహమాటంగా బయటికి చెప్పగల సత్తా ఉన్న నిర్మాతల్లో నాగవంశీ ముందు ఉంటాడు. ఏ విషయం అన్నా మీడియా ముందు మాట్లాడడానికి అస్సలు జంకడు. ఇక ఈ ఏడాది గుంటూరు కారం సినిమాను నిర్మించిన నిర్మాతల్లో నాగవంశీ కూడా ఒకడు. బాబాయ్ చినబాబుతో కలిసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో గుంటూరు కారం సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగవంశీ ఎంతో కాన్ఫిడెంట్ గా హిట్ అవుతుందని, రాజమౌళి సినిమా కలక్షన్స్ కు దగ్గరగా గుంటూరు కారం కలక్షన్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు.
ఇక నిర్మాత ఈ రేంజ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే.. సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో అని జనవరి 12 న ప్రేక్షకులు థియేటర్ కు క్యూ కట్టారు. కానీ, సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అప్పటినుంచి నాగవంశీ మీడియా ముందుకు రాలేదు. ఇక నేడు ఈ సినిమా నెగెటివ్ టాక్ పై నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టాడు. రివ్యూస్ గురించి, సినిమా నెగెటివిటీ గురించి ఏకిపారేశారు. ముఖ్యంగా కొన్ని రివ్యూస్ లో ఎమోషన్స్ లేవు అన్న పాయింట్ గురించి మాట్లాడుతూ.. ” కొన్ని రివ్యూలలో.. ఎమోషన్స్ లేవు.. ఎమోషన్స్ పండించలేదు అని రాశారు.. ఎమోషన్ అంటే ఏంటి.. మహేష్ బాబు కూర్చొని ఏడవాలా” అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్, నాగవంశీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.