Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్‌కు భయపడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్వయంగా నిర్మాత నాగవంశీ అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత క్లిష్టంగా మారాయో వివరిస్తూ, నిన్న ఆదివారం నాటికి విదేశాల్లో సెన్సార్‌కు అవసరమైన కాపీని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందని నాగవంశీ పేర్కొన్నారు. సాధారణంగా అక్టోబర్ 9న సినిమాను రిలీజ్ చేస్తే, మరుసటి రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్‌కి సెలవులు కలిసి వస్తాయన్నది నిర్మాతల మొదటి ఆలోచన. ప్రొడ్యూసర్‌గా సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేసేయాలని తనకు కూడా బలంగా అనిపించిందని ఆయన తెలిపారు.
అయితే, ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా సృష్టించిన భయం అలాంటి ఆలోచనలకు అడ్డుకట్ట వేసిందని ఆయన స్పష్టం చేశారు. హడావుడిగా రిలీజ్ చేసి క్వాలిటీ తగ్గితే, వచ్చే బ్యాక్లాష్, నెటిజన్ల నుంచి ఎదురయ్యే ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంటాయని, అందుకే ఆ భయంతోనే సినిమాను సేఫ్‌గా, పక్కాగా సినిమాను రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలనే ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకున్నామని వివరించారు. ఈ నిర్ణయం వల్ల కొందరు తిట్టుకుంటారని తెలిసినా, రాజీ పడక తప్పలేదని నాగవంశీ తేల్చిచెప్పారు. విడుదల వాయిదా వల్ల ప్రాజెక్ట్ మరింత మెరుగ్గా వస్తుందా అన్న ప్రశ్నకు ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. “ఇప్పుడున్న హడావుడిలో రిలీజ్ చేస్తే 80 శాతం అవుట్‌పుట్ మాత్రమే ఇవ్వగలను, అది రూపాయి వసూలు చేయొచ్చు. కానీ పూర్తి సమయం తీసుకుని 100 శాతం క్వాలిటీతో డెలివరీ చేస్తే, అదే సినిమా రూపాయి ఇరవై పైసలు రాబడుతుంది” అని నాగవంశీ నమ్మకం వ్యక్తం చేశారు. అభిమానులు ప్రస్తుతానికి కాస్త నిరాశకు గురైనా, వారికి వెండితెరపై ఉత్తమమైన క్వాలిటీతో కూడిన సినిమాను అందిస్తామన్న గ్యారెంటీ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?