Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత జంట విడాకులు తీసుకొని ఏడాది కావొస్తుంది. అయినా వీరి గురించిన వార్త ఏదైనా సరే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక ఈ జంట మధ్య విభేదాలు ఏంటి అనేది ఎవరికి తెలియవు కానీ ఈ జంట వారి వారి పాట్నర్స్ గురించి చెప్పే విధానమే అభిమానులను కన్ప్యూజ్ చేస్తోంది. మొన్నటికి మొన్న సమంత.. కాఫీ విత్ కరణ్ షో లో నాగ చైతన్య ఎదురుపడితే ఏం చేస్తారు అన్నదానికి.. సామ్ మాట్లాడుతూ మేము ఇద్దరం ఎదురుపడినప్పుడు పక్కనే పదునైన వస్తువులు ఉంచవద్దని, అతను తనకు మాజీ భర్త అని చెప్పుకొచ్చింది. ఇక సామ్ చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా చైతూ మాట్లాడడం ఆశ్చర్యం గా ఉందంటున్నారు అభిమానులు. మొదటి నుంచి చైతూ మృదు స్వభావి. సోషల్ మీడియాలో అస్సలు కనిపించడు. అందుకే విడాకుల అయ్యిన దగ్గరనుంచి ఇప్పటివరకు సామ్ గురించి చాలా తక్కువ స్పందించాడు.
ఒకవేళ అనుకోని పరిస్థితిలో సామ్ ప్రస్తావన తీసుకువచ్చినా ఆమె మంచి నటి, కోస్టార్ అని కితాబులిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో మరోసారి సామ్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు చైతూ. ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు సమంత మీకు ఎదురైతే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు అసలు తడబడకుండా సామ్ ఎదురుపడితే హాయ్ చెప్పి హాగ్ ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సమాధానం విన్నవారందరు షాక్ అయ్యారు. ప్రస్తుతం అక్కినేని వారసుడు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అక్కినేని అభిమానులు ఈ వ్యాఖ్యలను అండర్ లైన్ చేసి మా హీరో ఎంత మంచివాడు.. కావాలనే సామ్ అతడిని వదిలేసింది. ఆమె వలనే ఇదంతా జరిగింది. ఎంత సంస్కారం ఉంటే మీడియా ముందు మాజీ భార్య గురుంచి ఆలా మాట్లాడతాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.