అక్కినేని నాగ చైతన్య కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్నీ చై తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. షోయూ అనే పేరుతో హైదేరాబద్ లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘షోయూ’ క్లౌడ్ కిచెన్ విధానంలో పనిచేస్తుంది.. మీకు కావాల్సిన వంటకాలను స్విగ్గీ ద్వారా అందుబాటులో ఉంటాయి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా స్థిరమైన ప్యాకేజింగ్ విధానంతో ‘షోయూ’ వంటకాలు పంపిణీ చేయబడతాయని చైతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక చై సినిమాల విషయికొస్తే ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ చేస్తున్నాడు.. అదే దర్శకుడి దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. మరి ఒకపక్క సినిమాలు .. మరోపక్క బిజినెస్ ఈ రెండింటిని అక్కినేని హీరో ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.