Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nag Ashwin: పాన్-ఇండియా దర్శకుడిగా గ్లోబల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. తనలోని ఒదిగి ఉండే తత్వాన్ని చాటుకుని మరోసారి వార్తల్లో నిలిచారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ రోజుల్లో చిన్న సినిమాల నటులు, దర్శకులే పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా ఫీల్ అవుతూ హంగామా చేస్తున్న తరుణంలో.. స్టార్ హీరో ప్రభాస్, ఉలగనాయగన్ కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో ‘కల్కి 2898 AD’ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించి, ప్రస్తుతం దానికి సెకండ్ పార్ట్ పనుల్లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ చూపించిన సింప్లిసిటీ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చెన్నై వేదికగా జరిగిన ఒక సినిమా ఈవెంట్లో నాగ్ అశ్విన్ ప్రవర్తించిన తీరు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన తాజా చిత్రం “సింగ్ గీతం”. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ఈవెంట్‌ను తాజాగా చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా లోకనాయకుడు కమల్ హాసన్ విచ్చేశారు. స్టార్ హీరోలు, ప్రముఖులు రావడంతో హాల్ మొత్తం అతిథులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో వేదికపై, ముందు వరుసలో వచ్చిన గెస్టులకు కూర్చోవడానికి చోటు సరిపోలేదు. దాంతో ఏమాత్రం తటపటాయించకుండా, తానొక వందల కోట్ల బడ్జెట్ సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్‌ననే ఈగోను పక్కనబెట్టి.. నాగ్ అశ్విన్ నేరుగా గెస్టుల పక్కనే నేల మీద కూర్చుండిపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తన సినిమా ఈవెంట్‌కు వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నాగ్ అశ్విన్ నేల మీద కూర్చుని ఈవెంట్‌ను వీక్షించడం ఆయన సంస్కారానికి అద్దం పడుతోందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయ్యుండి కూడా ఎంతో సాదాసీదాగా కనిపించిన నాగ్ అశ్విన్ సింప్లిసిటీ ఎంతో మందికి ఆదర్శమని, నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనని నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
చిన్న సినిమాల నటులు, దర్శకులే సెలబ్రిటీలుగా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో ప్రభాస్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో కల్కి లాంటి పాన్ ఇండియా సినిమా చేసి సెకండ్ పార్ట్ ఇప్పుడు చేస్తున్న నాగ్ అశ్విన్ సింప్లిసిటీ ఎంతోమందికి ఆదర్శం.
తాజాగా నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు… pic.twitter.com/p54vFgCJjJ
— NTV Breaking News (@NTVJustIn) June 7, 2026
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు