Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా పలు కీలక, ఆసక్తికర అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. సినిమాలో చూపించే స్మోకింగ్ సీన్లు, ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం, అలాగే పోస్టర్లో వైరల్ అయిన తన జడల లుక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పోస్టర్లపై స్మోకింగ్ సన్నివేశాలను ప్రోత్సహించడం తన ఉద్దేశం కాదని చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా పోస్టర్లో కాయదు లోహర్ సిగరెట్ తాగే దృశ్యంపై స్పందిస్తూ నాని ఓపెన్‌గా సారీ చెప్పారు. “ఒక పాత్ర స్మోక్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి విలన్ అయిపోరు. మా నాన్న కూడా స్మోక్ చేస్తారు, కానీ ఆయన విలన్ కాదు. అయితే స్మోకింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన, చెత్త అలవాటు. సినిమా కథ, ఆ ప్రపంచం డిమాండ్ చేసింది కాబట్టే ఆ పాత్ర అలా ప్రవర్తిస్తుంది. అంతేకానీ ఎవరూ దాన్ని చూసి ప్రభావితం కావద్దు. అలాంటి లుక్‌ను పోస్టర్లో పెట్టినందుకు సారీ” అని చెప్పారు. దీంతో ఈ సినిమాలో కాయదు విలనా కాదా అనే డైలమాకి సమాధానం దొరికినట్లు అయ్యింది. కేవలం ఒక లుక్‌ను బట్టి ఆమె పాత్రను డిసైడ్ చేయవద్దని నాని చెప్పారు.
అలాగే ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రతీ పెద్ద సినిమాను వెంటాడుతున్న పైరసీ సమస్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “పైరసీ అనేది బొద్దింక లాంటిది. ఎంత కష్టపడి అణిచివేసినా, మూడు నెలల తర్వాత మళ్లీ ఎక్కడో ఒకచోట పుట్టుకొస్తుంది. గతంలో పైరసీ చేసిన ఒకడిని పట్టుకుంటే.. సోషల్ మీడియాలో వాడిని కొందరు హీరోగా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఎంతగానో సహకరిస్తూ నిందితులను పట్టుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఒక కమిటీ చర్చలు జరుపుతోంది. అతి త్వరలోనే పైరసీపై కఠినమైన చట్టాలు, మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను” అని స్పష్టం చేశారు. ‘ది ప్యారడైజ్’ పోస్టర్లో నాని వేసుకున్న రెండు జడల లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నాని స్పందిస్తూ.. “ఈ రోజుల్లో ఎవరూ జడలు వేసుకోవడం లేదు. అమ్మాయిలు జడల్లో ఎంతో అందంగా కనిపిస్తారు. చిన్నప్పుడు మన అమ్మలు ఎంతో శ్రద్ధగా జడలు వేసేవారు. కానీ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఆ పద్ధతినే పక్కన పెట్టేశారు. నూనె పెట్టి జడలు వేసుకోకపోవడం వల్లే హెయిర్ ఫాల్ సమస్యలు పెరుగుతున్నాయి. మళ్లీ అందరూ ఆ సాంప్రదాయ జడల ట్రెండ్‌ను మొదలుపెట్టాలి. పోస్టర్లో నా జుట్టు ఎంత బలంగా ఉందో చూశారుగా.. అందరూ మళ్లీ మన పాత పద్ధతికి రావాలి” అంటూ సరదాగా మాట్లాడారు.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
తాజావార్తలు
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?