Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gondhal: మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘గోంధళ్’ (Gondhal) 2027లో జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల కోసం ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, దేశవ్యాప్తంగా వివిధ భాషల నుండి పోటీ పడిన మొత్తం 33 సినిమాలను వెనక్కి నెట్టి మరాఠీ ‘గోంధళ్’ సినిమా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. సంతోష్ దావఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యం, అక్కడి సంప్రదాయ ఆచారం చుట్టూ సాగే అద్భుతమైన కథాంశంతో రూపొందగా, 2027 మార్చి 14న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లలో జరగబోయే ప్రధాన వేడుకలో ఇది భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
ఈ కథ కూడా చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. ఆస్కార్ రేసులో నిలిచిన ‘గోంధళ్’ ఒక రాత్రి జరిగే సాంప్రదాయ పూజా ఆచారం బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్రిప్పింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో నూతన వధూవరుల జీవితాల బాగు కోసం రాత్రంతా నిర్వహించే ‘గోంధళ్’ అనే జానపద దైవిక పూజ జరుగుతుండగా, తెరవెనుక ఒక ప్రమాదకరమైన హత్యకు కుట్ర నడుస్తుంది. సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్) అనే యువతి తనకు ఇష్టం లేని భర్త ఆనంద్ (యోగేష్ సోహోని) ని హతమార్చడానికి తనపై వ్యామోహంతో ఉన్న ఊరి ప్రెసిడెంట్ కొడుకును వాడుకుని, ఆ నేరాన్ని అతనిపై నెట్టి తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోవాలని ప్లాన్ చేస్తుంది. ఒకవైపు దైవికమైన మంత్రాలు, డప్పు చప్పుళ్లతో పూజ సాగుతుండగా, మరోవైపు ఈ క్రూరమైన మైండ్ గేమ్‌లో భర్త ఆనంద్ ఎలాంటి ప్రతికారం తీర్చుకున్నాడు? ఆ రాత్రి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ సినిమా ఉత్కంఠభరితమైన అసలు కథ.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
‘గోంధల్’లో ఇషితా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రలో నటించారు. కిషోర్ కదమ్, యోగేష్ సోహాని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2025లో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ‘గోంధల్’ ప్రదర్శించగా, దర్శకుడు సంతోష్ దావఖర్ బెస్ట్ డైరెక్టర్‌గా సిల్వర్ పీకాక్ అవార్డును అందుకున్నారు. ఆస్కార్ ఎంట్రీ కోసం ఈసారి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మొత్తం 33 సినిమాలు వచ్చాయి. వాటిలో 14 హిందీ సినిమాలు, నాలుగు మరాఠీ సినిమాలతో పాటు తెలుగు, తమిళం, గుజరాతీ తదితర భాషల సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగులో రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’, రవితేజ నటించిన ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’లతో పాటు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ సినిమాలు కూడా టాలీవుడ్ నుండి ఆస్కార్ ఎంట్రీ కోసం గట్టి పోటీ ఇచ్చాయి. ఈ సినిమాలు కూడా జ్యూరీని ఆకట్టుకున్నప్పటికీ, చివరికి మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘గోంధళ్’ (Gondhal) వీటన్నిటిని వెనక్కి నెట్టి ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.
- Tags
- cinema
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!